రానా.. బహుముఖ ప్రతిభ చూపించే నటుడు. విలన్ గా చేస్తూనే హీరోగా రాణిస్తాడు. సినిమాలో కీలక పాత్ర అయినా చేయడానికి రెడీ అయ్యే నటుడు. నటనే తన ఆశగా శ్వాసగా చేసుకున్న దగ్గుబాటి వారి వారసుడు. అటువంటి రానా ఇపుడు రవితేజాతో కలసి జట్టుకట్టబోతున్నాడు.

IHG

ఈ ఇద్దరు కలసి  ఒక మళయాళ్ రీమేక్ లో నటిస్తున్నారు. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న సూర్యదేవర నాగవంశీ తెలుగులో ఈ సినిమాను తీయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో అతి కీలక‌మైన పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉంది. దీనికి మొదట నట సింహం నందమూరి బాలక్రిష్ణను అనుకున్నారు. అయితే బాలయ్య ఆ పాత్ర చేసేందుకు నో చెప్పడంతో వెంకటేష్ ని అనుకున్నారు. అయితే వెంకీ కూడా సానుకూలత వ్యక్తం చేయకపోవడంతో ఇపుడు రవితేజాను ఆ పాత్రను సెలెక్ట్ చేశారు.

IHG

పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ రోల్ లో విక్రమార్కుడు మూవీ ద్వారా తమ మార్క్ ని క్రియేట్ చేసి  తనేంటో ప్రూవ్ చేసుకున్న రవితేజా మళ్ళీ ఈ సినిమాల్లో రెచ్చిపోయే విధంగా లాఠీతో శివతాండవం చేయనున్నాడు. ఇక రానా గురించి చెప్పేదేముంది. ఆయన కూడా ఈ మూవీలో టాప్ రేంజి నటనను చూపించాలని ఆత్రపడుతున్నాడు.

IHG' film review: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PRITHVIRAJ' target='_blank' title='prithviraj -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>prithviraj </a>and <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BIJU MENON' target='_blank' title='biju menon-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>biju menon</a> shine ...

మొత్తానికి చూసుకుంటే ఈ మల్టీస్టార‌ర్ మూవీ క్రేజీ ప్రాజెక్ట్ గా మారే అవకాశం ఉంది. ఇద్దరు విలక్షణ నటులు తమదైన నటనతో వెండితెరను పండించనున్నారు. ఈ మూవీ మళయాళంలో సూపర్ డూపర్ హిట్. తెలుగులో కూడా అంతకు మించి హిట్ అయ్యేలా డిజైన్ చేస్తున్నారుట. ఈ మూవీలో రవిజేతా, రానా బాడీ లాంగ్వేజికి తగినట్లుగా స్క్రిప్ట్ ని పక్కాగా రెడీ చేయాలనుకుంటున్నారు. మొత్తానికి తెలుగు ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేసే మోస్ట్ వాంటెడ్ మూవీస్ వరసలో ఈ మల్టీస్టార‌ర్ చేరుతుందని చెప్పాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: