అనుష్క శెట్టి కెరీర్ లో అరుంధతి సినిమా ఒక అధ్బుతం అని చెప్పాలి. అనుష్క ఇండస్ట్రీకొచ్చిన ఇన్నేళ్ళలో తన గురించి మాట్లాడాలనుకుంటే అందరు ముందు అరుంధతి సినిమా గురించే మాట్లాడతారు. అనుష్క సినిమా కెరీర్ అరుంధతి ముందు అరుంధతి కి తర్వాత అన్నట్టుగా ఉంటుంది. ఈ సినిమా తర్వాత అనుష్కకి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి. కాని అరుంధతి స్థాయి సక్సస్ మాత్రం దక్కలేదు. భాగమతి అన్న సినిమా వచ్చినప్పటికి ఆ సినిమా యావరేజ్ గానే నిలిచింది. ప్రస్తుతం అనుష్క నిశబ్ధం అన్న సినిమాలో నటించింది. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.

 

ఇక అనుష్క తర్వాత మళ్ళీ కీర్తి సురేష్ కి అటు తమిళం ఇటు తెలుగు ఇండస్ట్రీలలో ఆ రేంజ్ క్రేజ్ వచ్చింది మహానటి సినిమాతో. అంతకముందు తమిళంలో చాలా సినిమాలు చేసింది. వాటిలో సూపర్ హిట్స్ ఉన్నాయి. అలాగే తెలుగులోను నేను శైలజ, నేను లోకల్, అజ్ఞాత వాసి వంటి సినిమాలు చేసింది. కాని మహానటి కీర్తి సురేష్ ని తారా స్థాయికి తీసుకు వెళ్ళింది. ఈ సినిమా కీర్తి సురేష్ కెరీర్ లో ఒక అద్భుతమైన సినిమాగా మిగిలిపోతుందనడానికి ఎలాంటి సందేహం లేదు.

 

అయితే కీర్తి సురేష్ కూడా సినిమాల ఎంపిక విషయంలో అనుష్కనే ఫాలో అవుతుందా...అన్న సందేహాలు కలుగుతున్నాయి. అందుకు కారణం మహానటి తర్వాత ఎక్కువగా కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల లిస్ట్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలే ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన పెంగ్విన్ కీర్తి సురేష్ తో పాటు ప్రేక్షకులని నిరాశ పరచింది. దాంతో ఇప్పుడు ఆ ప్రభావం మిస్ ఇండియా సినిమా మీద పడిందని అంటున్నారు.

 

ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేద్దామంటే నిర్మాతకి మంచి ఆఫర్ రావడం లేదట. ఇక పెంగ్విన్ తర్వాత కీర్తి కి కాస్త నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుందట. మరి హీరోయిన్స్ ధైర్యం చేసి మంచి కథా బలమున్న సినిమాలను ఎంచుకొని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే అదే వాళ్ళకి శాపంగా మారుందా అని మాట్లాడుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: