మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా రావడం లేదు. నిజానికి ఆగస్టు లోనే విడుదలకావల్సిన ఈచిత్రం కరోనా వల్ల వాయిదాపడింది అయితే ఇటీవల ప్రభుత్వం షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో జులై లో మిగిలిన షూటింగ్ ను ప్రారంభించి సెప్టెంబర్ లోపు సినిమాను పూర్తి చేసి దసరాకు ప్రేక్షకులకుముందుకు తీసుకురావాలనుకున్నారు కానీ ప్రస్తుతం దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా తీవ్ర రూపం దాల్చడంతో షూటింగ్ చేసే సాహసం చేయలేకపోతున్నారు.
 
ఇక షూటింగ్ మరింత ఆలస్యం కానుండడంతో ఆచార్య, దసరా తోపాటు సంక్రాంతి బరిలోనుండి  తప్పుకోనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. టాప్  డైరెక్టర్  కొరటాల శివ డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా రామ్ చరణ్ , సోను సూద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైమెంట్స్ ,కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ ఈచిత్రాన్ని సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. 
 
ఈసినిమా తరువాత చిరు, సాహో ఫేమ్ సుజీత్ డైరెక్షన్ లో 153సినిమా లో నటించనున్నాడు. మలయాళ బ్లాక్ బాస్టర్ మూవీ లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని దసరా రోజున లాంచ్ చేయనున్నారని సమాచారం.
 
ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు. ఈసినిమాలో మంజు వారియర్ పాత్రలో అలనాటి హీరోయిన్ సుహాసిని  కనిపించనుందని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: