పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. లాక్ డౌన్ లేకుంటే మే నెలలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ మీద చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలిసిందే. ఆల్రెడీ పవన్ లేకుండా ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు క్రిష్. విరూపాక్ష టైటిల్ తో వస్తున్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా వస్తుంది. పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమాలో చూస్తారని చిత్రయూనిట్ చెబుతున్నారు. 

 

ఇక ఈ సినిమా నుండి వచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటంటే సినిమాలో కేవలం రెండంటే రెండు సాంగ్స్ మాత్రమే ఉంటాయట. అవి కూడా మోంటేజ్ సాంగ్స్ అని తెలుస్తుంది. సినిమాలో మరో రెండు సాంగ్స్ పెడదామని అనుకున్నా పవన్ వద్దని చెప్పాడట. అంతేకాదు ఇక మీదట తను చేసే సినిమాల్లో హీరోయిన్స్ తో డ్యూయెట్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాడట పవన్ కళ్యాణ్. తానో పార్టీ అధ్యక్షుడిగా అలా చేయడం కరెక్ట్ కాదన్నది ఆయన పాయింట్ అట. అయితే అదో సినిమా అని ఆడియెన్స్ కు, ఫ్యాన్స్ కు తెలుసు కాబట్టి హీరోయిన్స్ తో డ్యూయెట్స్, డ్యాన్సింగ్ నంబర్స్ వద్దనుకోవాల్సిన అవసరం లేదని అందరు అంటున్నారు.

 

వకీల్ సాబ్ రిలీజ్ ఇంకా సంక్షోభంలోనే ఉంది. ఓ మాట 2021 సంక్రాంతికే సినిమా రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరి వకీల్ సాబ్ రిలీజ్ అయితేనే కాని క్రిష్ సినిమాకు పూర్తిస్థాయిలో పవన్ వర్క్ చేయడం కుదరదు. ఇక పవన్ సినిమాల్లో డ్యాన్సులు, రొమాంటిక్ డ్యూయెట్స్ గురించి కూడా ఆలోచించాలని అంటున్నారట. మరి ఫ్యాన్స్ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: