మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది భూమిక. అగ్ర హీరోల సినిమాల్లో చాలా చాలా మంచి పాత్రలు పోషించి తన మార్క్ ని వేసుకుంది ఆమె. స్టార్ హీరోల సినిమాలు అనగానే తాను గుర్తు వచ్చే విధంగా చేసింది కొన్ని పాత్రలు. జూనియర్ ఎన్టీఆర్ కి మరదలి గా అలాగే ఒక్కడు సినిమాలో... ఆమె పోషించిన పాత్రలకు చాలా మంచి డిమాండ్ వచ్చింది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చాలా వరకు నటించారు అనే చెప్పాలి. ఇక ఆమె చిరంజీవి కి ఒక సినిమాలో భార్యగా నటించారు. జైచిరంజీవ సినిమాలో ఆయనను అత్యవసర పరిస్థితిలో ఆమె వివాహం చేసుకుంటారు. 

 

సినిమా హిట్ అవలేదు గాని వారి కాంబినేషన్ మాత్రం చాలా బాగా హిట్ అయింది. అవసరం మేరకు ఆమె వివాహం చేసుకోవడం ఆ పాత్రలో ఆమె చాలా అందంగా నటించడం ఇంకా జనాలకు గుర్తు ఉంది అనే చెప్పాలి. ఆ పాత్రలో ఆమెకు చాలా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ సినిమాలో కథ సరిగా లేకపోవడం తో ఆ సినిమా హిట్ కాలేదు. ఏదో ఊహించి ఏదో తీసారు అనే పేరు ఆ సినిమాకు వచ్చింది. ఇక చిరంజీవి కూడా ఆ సినిమా విషయంలో చాలా అసహనం వ్యక్తం చేసారు అని అంటారు. 

 

దర్శకుడి పని తీరు విషయంలో ఆయన అసహనంగా ఉన్నారు అని చెప్తారు. ఇక ఆ తర్వాత ఆయన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన ఒకటి రెండు సినిమాలు చేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. ఇప్పుడు ఆయన కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నారు. భూమిక కూడా మంచి పాత్రలు ఉంటే మాత్రం సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: