తెలుగు టెలివిజన్ పై అత్యంత పాపులర్ అయిన రియాలిటీ షో ఏదనగానే టక్కున గుర్తొచ్చే పేరు బిగ్ బాస్. కనిపించని ఒక పెద్ద మనిషి తన మాటల ద్వారానే ఒక ఇంట్లో ఉన్న మనుషులతో ఆడించే ఈ గేమ్ తెలుగులోనే కాదు చాలా భాషల్లో పాపులర్ అయింది. అయితే తెలుగులో ఇప్పటి వరకూ మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో నాలుగవ సీజన్ కి రెడీ కాబోతుంది. మూడవ సీజన్ ని వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున నాలుగవ సీజన్ కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.

 

 

మొదటి సీజన్లో ఈ షో 70 రోజుల పాటు సాగింది. రెండు, మూడవ సీజన్లని  వందరోజులకి పెంచారు. 14 మంది కంటెస్టెంట్లతో రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వందరోజుల పాటు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించారు. అయితే ఈ సారి బిగ్ బాస్ రూల్స్ అన్నీ మారనున్నాయి. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ భారీగా ఉండడంతో నాలుగవ సీజన్ ని కేవలం 50రోజులకే పరిమితం చేయాలని చూస్తున్నారట. 

 

కేవలం యాభైరోజులకే కాదు కంటెస్టెంట్స్ ని కూడా తగ్గించనున్నారు. 12 మంది కంటెస్టెంట్లని తీసుకుని, ఒక వైల్డ్ కార్ట్ ఎంట్రీకి అనుమతి ఉండనుందట. 12మంది కంటెస్టెంట్లతో యాభైరోజుల పాటు టెలివిజన్ ప్రేక్షకులకి వినోదాన్ని పంచడానికి రెడీ అవుతుందట. ఈ పాటికే అన్నపూర్ణ స్టూడియోలో సెట్ పూర్తి చేసారట. సేఫ్టీ ప్రమాణాలు పాటించే నేపథ్యంలో బెడ్ రూమ్స్ నుండి వాష్ రూమ్స్ వరకి ప్రతీదీ సెపరేట్ గా ఉండబోతుందట. 

 


ఇంతకుముందులా కాకుండా కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే వినోదాన్ని అందించనున్నారట. ప్రస్తుతం కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసుకునే పనిలో ఉన్న బిగ్ బాస్ యాజమాన్యం, మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయనుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: