రాబోయే రెండేళ్ళు కూడా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖాళీ గా ఉండే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకుని ఆ సినిమాలను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకుని వెళ్లి వాటిని ఎప్పుడు పూర్తి చేసి విడుదల చేద్దామా అని ఆసక్తిగా ఆశగా ఎదురు చూస్తున్నారు. అది ఎంత వరకు ఫలిస్తుంది ఏంటీ అనేది ఇంకా తెలియదు గాని ఇప్పుడు మాత్రం ఆయన దాదాపుగా రెండు సినిమాలను వచ్చే ఏడాది ఎలా అయినా సరే విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే ఆయన తన చేతిలో ఉన్న సినిమాలను దాదాపుగా పండగల సమయం లోనే విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసినట్టు టాక్ మరి. అది ఎందుకు ఏంటీ అంటే... సంక్రాంతికి టాలీవుడ్ లో ఏ సినిమా కూడా వచ్చే ఏడాదికి రెడీ గా లేదు అని చెప్పాలి. ఆ తర్వాత కూడా దాదాపు మూడు నెలలు సినిమాలు లేవు ఆచార్య సినిమా చూస్తే వచ్చే ఏడాది ఆగస్ట్ లో వచ్చే అవకాశం ఉంది. మహేష్ సినిమా గాని ఆర్ఆర్ఆర్ గాని వచ్చే ఏడాది కష్టమే. ఈ రెండు సినిమాల విషయంలో ఇప్పుడు అసలు దర్శక నిర్మాతలు ఏమీ చెప్పలేని పరిస్థితి. 

 

ఇక ఇప్పుడు అందుకే పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారట. దసరా కు ఒక సినిమా... సంక్రాంతికి ఒక సినిమాను లైన్ లో పెట్టేస్తున్నారు అని సమాచారం. సంక్రాంతికి వకీల్ సాబ్ ని విడుదల చేసి దసరా కు మాత్రం క్రిష్ సినిమాను విడుదల చేసి వచ్చే ఏడాది కాకుండా 2022 లో వేసవిలో హరీష్ శంకర్ సినిమాను లైన్ లో పెట్టాలి అని భావిస్తున్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: