1998లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆవిడే మా ఆవిడ చిత్రంలో అక్కినేని నాగార్జున, టబు, హీరా రాజగోపాల్, శ్రీహరి ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ గురించి తెలుసుకుంటే... హైదరాబాద్ నగరంలో విక్రాంత్( నాగార్జున) సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంటాడు. ఐతే తండ్రి (గిరిబాబు) విక్రాంత్ ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే డ్యూటీ లో భాగంగా విక్రాంత్ కి ఎస్సై అర్చన(టబు) ఎదురవుతుంది. ఆమె సినిమా థియేటర్ల ముందు బ్లాక్ టికెట్లు అమ్ముతుండగా విక్రాంత్ ఆమెను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాడు. తదనంతరం ఆమె మారువేషంలో ఉన్న ఎస్ ఐ అని తెలుసుకుంటాడు. నన్నే స్టేషన్ లో వేస్తారా అని ఆమె ఆగ్రహించి విక్రాంత్ పై ప్రతీకారం తీర్చుకుంటుంది. 

 


ఆ విధంగా ఆ ఇద్దరి మధ్య చిన్న పోట్లాట మొదలవుతుంది. చివరికి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. కానీ విధి వక్రీకరించి అర్చనని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఆ విషయం తెలుసుకోలేని విక్రాంత్ తన భార్య చనిపోయిందని బాగా మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతడు పడుతున్న బాధని తొలగించడానికి విక్రమ్ తండ్రి, అర్చన తల్లి అతడికి ఝాన్సీ అనే అమ్మాయి తో పెళ్లి చేస్తారు. కానీ తన భార్య నిజంగా చనిపోలేదని విక్రాంత్ కి తెలుస్తుంది. దీంతో అతడు తన మొదటి భార్య దగ్గర తన రెండవ వివాహాన్ని దాచి పెడతాడు. అలాగే ఒకరి విషయం ఒకరికి తెలియకుండా మేనేజ్ చేయడానికి విక్రాంత్ చాలా కష్టపడుతున్నాడు. చివర్లో అర్చన కి విక్రాంత్ రెండవ పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. అలాగే ఝాన్సీ కి కూడా విశ్రాంత్ కి ఎప్పుడో పెళ్లి అయింది అన్న విషయం తెలుస్తుంది. దీంతో వాళ్ళిద్దరూ అతని పై విరుచుకుపడతారు. అతను వారిని శాంతపరిచి అసలైన నిజం చెప్పి తన మొదటి భార్య తో జీవితం సాగించడానికి సిద్ధమవుతాడు. 

 


ఇకపోతే ఈ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను బాగా అలరించింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాగార్జున కు భార్య పాత్రలో నటించిన హీరా, టబు తమ నటనా చాతుర్యంతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఫస్టాఫ్ లో టబు ఆరబోసిన అందచందాలకు అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. నిన్నే పెళ్ళాడతా చిత్రంలో కూడా నాగార్జున సరసన నటించి ప్రేక్షకుల మనసులను దోచేసింది టబు.

మరింత సమాచారం తెలుసుకోండి: