టాలీవుడ్... ఇప్పుడు కొందరు యువ దర్శకులు ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. అగ్ర హీరోలు చిన్న  హీరోలు అందరూ కూడా ఇప్పుడు యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే మన తెలుగు లో సీనియర్ ధర్శకులనే తీసుకునే అవకాశాలు ఉన్నాయి అని చిన్న దర్శకులను పక్కన పెట్టడం ఖాయమని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇప్పుడు దాదాపుగా టాలీవుడ్ జనాలు అందరూ కూడా అగ్ర హీరోల సినిమాల మీదనే ఫోకస్ చేసారు. 

 

ఇప్పుడు యువ దర్శకుడు బాబీ విషయంలో మాత్రం కాస్త మెగా ఫ్యామిలీ సానుకూలంగా ఉంది అని అంటున్నారు.  నిజం ఎంత అనేది తెలియదు గాని ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికి గానూ మెగా హీరోలు రెడీ అవుతున్నారట. రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో వరుణ్ తేజ్ హీరో గా అతని తో సినిమాను లైన్ లో పెట్టే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. నిజం ఎంత అనేది తెలియదు గాని దీనిపై మాత్రం చర్చలు జరుగుతున్నాయి. వరుణ్ తేజ్ ని హీరో గా పెట్టి సినిమా చేయడానికి గానూ ఇప్పుడు రామ్ చరణ్ ఆసక్తిగా ఉన్నాడు అని అంటున్నారు. 

 

సీనియర్ దర్శకులను నమ్మి వారి తో సినిమా చేస్తున్న వేళ రామ్ చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గ మారింది. మన తెలుగులో బాబీ కి ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. అయినా సరే రామ్ చరణ్ అతన్ని నమ్మి ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేసారు అని తెలుస్తుంది. కథ విన్నారు అని అన్ని ఓకే అయ్యాయి అని అంటున్నారు మరి. ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది  అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: