తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోలకు భార్య పాత్రలో నటించడానికి చాలా మంది హీరోయిన్లు కాస్త వెనుకడుగు వేస్తుంటారు. పెళ్ళైన మహిళ పాత్రలో నటిస్తే ఆ తర్వాత తమకు వచ్చే ఆఫర్లు అన్ని అలాగే ఉంటాయని... భావిస్తూ వుంటారు చాలామంది హీరోయిన్లు, అందుకే ఇలా హీరోయిన్లు భార్య పాత్రలో నటించడానికి కాస్త వెనకడుగు వేస్తారు అని చెప్పాలి. అయితే కొంత మంది మాత్రం ఓ వైపు అందాలు ఆరబోస్తునే  మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఉంటారు.


ఇలా అప్పటి వరకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తన అందాల ఆరబోతతో ఎంతగానో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్  హీరోయిన్ విద్యాబాలన్ తెలుగు చిత్ర పరిశ్రమలో... ఎన్టీఆర్ కు భార్య పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో... ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో నటించింది బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్. అయితే వైవిధ్యమైన పాత్రలకు బాలీవుడ్ లో కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది విద్యాబాలన్. ఇప్పటికే ఎన్నో నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.


 ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో  విద్యాబాలన్ పరకాయ ప్రవేశం చేసింది అని చెప్పాలి.... ఆ పాత్రకు తగ్గట్లుగా హావభావాలను పండిస్తూ తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఈ పాత్రకు గానూ విద్యాబాలన్ కి  విమర్శకుల ప్రశంసలు దక్కాయి  సైతం అనడంలో అతిశయోక్తి లేదు. ఓ వైపు భర్త బాగోగులు చూసుకుంటూనే మరోవైపు పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ... తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా క్యాన్సర్ బారిన పడిన బసవతారకం హావభావాలను... అచ్చుగుద్దినట్టు గా తన నటనలో చూపించింది విద్యాబాలన్. నేటి తరానికి బసవతారకం అంటే విద్యాబాలన్ లాగానే ఉంటుందేమో అనేంతలా ఆ పాత్రలో ప్రభావితం చేసింది.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: