నానిని హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన రెండు సినిమాలు హిట్లు కొట్టగా హ్యాట్రిక్ మూవీగా 'వి' రాబోతుంది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా కరోనా వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ లేకపోతే ఎప్పుడో రిలీజ్ చేసేవారు. కాని లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ ఆపేయాల్సి వచ్చింది. ఇక ఈ సినిమా ఓటిటి లో వస్తుందని కొద్దిరోజులు హడావిడి చేశారు. దర్శక నిర్మాతలు మాత్రం థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో అప్పుడే ఈ సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు.

'వి' లో నివేదా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటించారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించారు. అప్పట్లో రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే సినిమాలో హైలెట్ అంశాలు చాలా ఉన్నాయట. ముఖ్యంగా నాని మిలటరీ మేజర్ పాత్రలో వచ్చే సీన్స్  అద్భుతంగా ఉంటాయట. సినిమాలో ఆ ఎపిసోడ్ మొత్తం వేరే రేంజ్ లో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా మూల కథ అదే అని తెలుస్తుంది. ఇప్పటి వరకు నాని 'వి' నుండి ఎలాంటి లీక్స్ బయటకు రాలేదు కాని ఈ మేజర్ పాత్ర గురించి బయటకు రావడం ఆడియెన్స్ కు షాక్ ఇస్తుంది.

అయితే సినిమాపై అంచనాలు పెంచేందుకు.. నాని 'వి' పై మళ్ళీ బజ్ పెంచేందుకు ఈ లీకులు చేస్తున్నారని అంటున్నారు. నాని ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ విలన్ గా నటిస్తున్నారు. సినిమా తప్పకుండా ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగానే ప్లాన్ చేశారట. నాని, మోహనకృష్ణ ఇద్దరిది హిట్ కాంబినేషన్ కచ్చితంగా ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ఆడియెన్స్ కూడా పక్కా హిట్ అనే అంచనాలతో ఉంటారు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: