కొన్ని సినిమాల్లో హీరోల పాత్రలకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ల పాత్రలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. సరిసమానమైన పాత్రల ద్వారా కధాంశాన్ని సినిమాలో రక్తి కట్టించేందుకు వీలవుతుంది. అటువంటి సినిమాలు తెలుగు సినిమాల్లో ఎక్కువగానే వచ్చాయి. అలా చక్కటి పాత్రల ద్వారా హీరోయిన్లను నిలబెట్టిన సినిమాల్లో ‘పెదరాయుడు’కు ప్రత్యేక స్థానం ఉంది. సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన మోహన్ బాబుకు ఎంత పేరొచ్చిందో అదే స్థాయిలో ఆయన భార్యగా నటించిన భానుప్రియకు కూడా అంతే పేరొచ్చింది. సినిమాకు మహిళాదరణ దక్కటానికి భానుప్రియ ప్రధాన కారణంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు.

IHG

 

సినిమా మొత్తం జమిందారీ వ్యవస్థ, గ్రామీణ వాతావరణంలోనే జరుగుతుంది. పెదరాయుడు పాత్రలోని గాంభీర్యానికి తగ్గట్టుగానే లక్ష్మీ పాత్ర ఉంటుంది. మామగారు పాత్రలో రజినీకాంత్ పిల్లలు జాగ్రత్త.. అని ఓ సన్నివేశంలో అంటే.. ‘బిడ్డల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మామగారూ..’ అంటుంది. మరిది అని కాకుండా వారిని బిడ్డలుగా చూసుకోవడం అనే సన్నివేశం మహిళలకు విపరీతంగా నచ్చింది. ఈ డైలాగ్ ఆమె పాత్రలోని బలాన్ని తెలియజేస్తుంది. భానుప్రియను కోడలి పాత్రలో సౌందర్య అవమానించిన సందర్భంలోనూ ఆమె నటన, హావభావాలు సినిమాకు అదనపు బలాన్నిచ్చాయి. ప్రతి సన్నివేశంలో కూడా పెదరాయుడు గాంభీర్యానికి లక్ష్మి పాత్రలో భానుప్రియ భర్త గౌరవాన్ని నిలబెడుతుంది.

IHG

 

సినిమాలో భానుప్రియ మాత్రమే కాకుండా సౌందర్య పాత్ర కూడా ఇదే తరహాలో సాగుతుంది. కలవారి అమ్మాయిగా అడుగుపెట్టి అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేదు. కానీ తెలుసుకున్నాక సౌందర్య పాత్రలో ఔన్నత్యం కనపడుతుంది. సినిమా క్లైమాక్స్ లో భానుప్రియ స్థానాన్ని సౌందర్య భర్తీ చేస్తుంది. ఇలా ఈ సినిమాలో భానుప్రియ, సౌందర్య పెద్దరికం ఉన్న పాత్రల్లో మెప్పించారు. ఈ సినిమా అత్యంత ప్రజాదరణ పొందడానికి వీరిద్దరి పాత్రలు కూడా ఎంతో సహకరించాయని చెప్పాలి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: