తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదాల చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుడు రాంగోపాల్ వర్మ. తాజాగా ఈయన దర్శకత్వంలో మర్డర్ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా మిర్యాలగూడ మర్డర్ హిస్టరీ కథ ఆధారంగా తెరకెక్కుతున్నగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఇటీవల రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ లతో సహా ప్రముఖ హీరోల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

 


ఆ ఇంటర్వ్యూ లో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా మీరు చాలా ఇష్టపడతారు కానీ రాజకీయ నాయకుడిగా కాదు అని తెలిపారు. ఇక రామ్ గోపాల్ వర్మ దృష్టిలో బెస్ట్ సీఎం అంటే ఎవరూ లేరన్న ఆర్జివి ఫ్యూచర్ లో కెవిఎన్ పవన్ అని వివరించడం జరిగింది. పవన్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే మెరిట్ ఆఫ్ యూనిక్ వన్ పీస్ అంటూ పవన్ కళ్యాణ్ తెగ పొగిడేశారు. దింతోపాటు వరల్డ్ లోనే పవన్ కళ్యాణ్ ఓన్లీ వన్ పీస్ అని ప్రశంసల వర్షం కురిపించాడు.. 

 


ఇక మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో హైలెట్ అయ్యే రాంగోపాల్ వర్మ టాలీవుడ్ హీరోల గురించి ఇలా పాజిటివ్ గా మాట్లాడటం చాలా విశేషం మైన విషయం అనే చెప్పాలి.సరి కొత్తగా ఆయన తెలుగు OTT  ప్రపంచాన్ని కాదని తానే సొంతంగా ఒక యాప్ ను తయారు చేసి అందులో ఏకంగా సినిమాలని రిలీజ్ చేస్తూ టాలీవుడ్ లో సంచలనాలకు దారి తీస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అందరిది ఒక దారి రాంగోపాల్ వర్మ ఒక దారి అనేది అందుకే ఒక కాబోలు.

మరింత సమాచారం తెలుసుకోండి: