కరోనా వచ్చి మొత్తం వ్యవస్థల మీద దెబ్బ కొట్టేసింది. సినీ పరిశ్రమపై కూగా గట్టిగానే ప్రభావం చూపింది. షూటింగ్స్, క్యాన్సిల్.. రిలీజ్ నిల్.. అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ప్రస్తుతం షూటింగ్స్ కు పర్మిషన్ తెచ్చుకున్నా ధైర్యం చేసి బయటకెళ్లలేని పరిస్థితులను నెలకొల్పింది. దీంతో చిన్న హీరో, ప్రొడక్షన్ నుంచి పెద్ద హీరోల సినిమాల వరకూ అందరికీ కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఈ కన్ఫ్యూజన్ లో చిరంజీవి ఆచార్య, రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా ఇరుక్కుపోయాయి. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపై ఓ ఆసక్తికర కథనం సినీ సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది.

IHG's Leaked Look from Acharya

 

ఈ రెండు సినిమాల్లో ఆచార్య ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పటికి 30శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి ఈ ఏడాది కాదు కదా.. త్వరలో షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి కూడా రావడం కష్టమే. దీంతో ఈ సినిమా వచ్చే వేసవికి రిలీజ్ అవుతుంది అంటున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ఇప్పటికే రెండు సీజన్లు మారింది. అనుకున్నట్టు జరిగుంటే వచ్చే నెల్లో విడుదల కావాల్సిన సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 8కి వెళ్లింది. 70శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఇప్పుడు ఆ డేట్ కూడా మార్చుకున్నట్టే. వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని వినికిడి.

IHG

 

ఈ నేపథ్యంలో తండ్రీకొడుకుల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయి. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు ఆనందమే. అయితే.. ఆచార్యలో ముఖ్యపాత్రలో చరణ్ నటించాలని చిరంజీవి పట్టుబడుతున్నాడు. కానీ.. షూటింగ్స్, కాల్షీట్స్ అన్నీ తారుమారైపోవడంతో ఇదెంతవరకూ జరుగుతుందో తెలియాల్సి ఉంది. ఇదే జరిగితే ఒక్క సమ్మర్ లోనే చరణ్ రెండు సినిమాలు సందడి చేయడం ఈరోజుల్లో వండర్ అవుతుంది. ఈ వార్తలపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

IHG was jealous of his son <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CHARAN' target='_blank' title='ram charan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram charan</a> because of THIS reason

మరింత సమాచారం తెలుసుకోండి: