ఏంటీ.. వెంక‌టేష్‌కు త‌మ‌న్నా విశ్వ‌రూపం చూపించిందా..? ఎక్క‌డా..? ఎప్పుడు..? ఇలా టైటిల్ చూడ‌గానే ఎన్నో ప్ర‌శ్న‌లు మీకు వ‌స్తుంటాయి. అయితే అది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్.. రీల్ లైఫ్‌లో. విక్ట‌రీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ కౌర్.. ఈ న‌లుగుర క‌లిసి న‌టించిన సినిమా ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్. వరుస విజయాలతో దూకుడు మీదున్న యువ దర్శకుడు అనీల్ రావిపూడి ఈ మల్టీస్టారర్ సినిమాను తెర‌కెక్కించాడు. గ‌త ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టుకుంది. 

 

సాధార‌ణంగా భార్యాభర్తల జగడాలు, కీచులాటలు తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి సక్సెస్‌ ఫార్ములా అని గతంలోనే రుజువయింది. అయితే బాక్సాఫీస్‌ పరంగా కాలం చెల్లిపోయిందని అనుకున్న ఈ ఫార్ములాకి కాస్త మోడ్రన్‌ టచ్‌ ఇచ్చి ఎఫ్‌ 2 అంటూ మగాళ్లు, ముఖ్యంగా మొగుళ్ళ ఫ్రస్ట్రేషన్‌ని, తద్వారా ఉత్పన్నమయ్యే ఫన్‌ని ప్రేక్ష‌కుల‌ ముందుకి తీసుకురావ‌డంతో మంచి విజ‌యం అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమా వెంకీకి భార్య త‌మ‌న్నా న‌టించ‌గా.. వ‌రుణ్‌కు ల‌వ‌ర్‌గా మెహ్రీన్ న‌టించింది.

 

అయితే ఈ సినిమాలో వెంకీకి విశ్వ‌రూపం చూపిస్తూ త‌మ‌న్నా టార్చ‌ర్ పెడుతుంది. భార్య పెట్టే టార్చర్‌తో ఫ్రస్టేషన్‌ ఊగిపోయే వెంకీ నటన మరింత వినోదాన్ని పంచుతూ సాగుతుంది. ఇక వెంకీతో త‌మ‌న్నా ఆడుకునే ఒక్కో సీన్ కడుపులు చెక్కలు చేస్తుంది. అయితే త‌మ‌న్నా భ‌ర్త‌ను టార్జ‌ర్ పెట్టే పాత్ర‌లోనే కాకుండా.. సినిమా లాస్ట్‌లో వెంకీతో ఎమోషనల్ సీన్లలోనూ ఆక‌ట్టుకుంది. అలాగే వ‌రుణ్‌, మెహ్రీన్ న‌ట‌న కూడా అద్భుతం అని చెప్పాలి. ఇక భార్య, భర్తల మధ్య ప్రేమానురాగాలు, కలహాలు కలబోసిన వడ్డించిన సినిమానే ఎఫ్2. కథాపరంగా ఇందులో చెప్పుకోతగ్గ స్టఫ్‌ లేదు. అయితే ఫన్‌ క్యారెక్టర్స్‌ని, ఫన్నీ సిట్యువేషన్స్‌ని సృష్టించి సినిమా చూస్తున్నంతసేపు టైమ్‌ పాస్‌ చేయడంతో సక్సెస్ సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: