నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగులో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు లిస్టు చాలా పెద్దదే. కొందరు కొత్తగా వచ్చి స్టార్లు అయితే.. మరికొందరు స్టార్ అయ్యాక కూడా సినిమాలు చేసినవారు ఉన్నారు. ప్రస్తుతం ఈ లిస్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కూడా ఉంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ సరసన నటిస్తోంది. ఈ నేపథ్యంలో అలియాను మరో తెలుగు సినిమాలో కూడా నటిస్తోందని.. అది కూడా చిరంజీవి ఆచార్యలో రామ్ చరణ్ పక్కనే అని ఈమధ్య కొన్ని వార్తలు రౌండ్ అవుతున్నాయి.

IHG

 

ఆచార్యలో రామ్ చరణ్ తో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయించాలని చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో చరణ్ కు హీరోయిన్ కూడా ఉంటుందట. దీంతో ఈ పాత్రను అలియాతో చేయంచాలని ఆమెను సంప్రదించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అలియా ఆచార్యలో పార్ట్ కావడం లేదని ఇండస్ట్రీలో మరో వార్త రౌండ్ అవుతోంది. అలియాను చరణ్ పక్కన చేయాలని ఎవరూ సంప్రదించలేదని కూడా అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ కూడా వాయిదా పడిన నేపథ్యంలో చరణ్ ఆచార్యలో చేస్తాడా లేదా అన్నది ఇంకా సస్పెన్సే.

IHG

 

ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు ఆర్ఆర్ఆర్, సంజయ్ లీలా భన్సాలీ సినిమా, కరణ్ జోహార్ తక్థ్, బ్రహ్మాస్త్ర సినిమాల్లో మాత్రమే నటిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంత బిజీగా ఉన్న అలియా మరో తెలుగు ప్రాజెక్టు చేసే అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది. దీనిపై పూర్తి అఫిషియల్ న్యూస్ ఆచార్య టీమ్, రామ్ చరణ్ రివీల్ చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది వేసవికి వస్తుందని అంటున్నారు.

IHG's bag of surprises

మరింత సమాచారం తెలుసుకోండి: