వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల కాలంలో అన్ని బూతు సినిమాలనే తెరకెక్కిస్తున్నాడు. దీంతో అతనికి తన జీవితంలో ఎప్పుడూ రాని చెడ్డ పేరు వస్తుంది. శివ, క్షణక్షణం, సర్కార్, రంగీలా, గాయం వంటి సినిమాలను తెరకెక్కించిన గొప్ప దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలను తీస్తూ నీచమైన స్థాయికి దిగజారడం చాలా బాధాకరం అని తన అభిమానులు నెట్టింట ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మియా మాల్కోవా తో క్లైమాక్స్ సినిమా తీసి డిజిటల్ రిలీజ్ చేసి అతను లాభపడ్డాడు కానీ అతని దర్శకత్వానికి చెడ్డ పేరే వచ్చింది. 


ఆ సినిమాని పక్కనపెడితే... తాజాగా భారతీయ మహిళ తో నేకేడ్(నగ్నం) అనే శృంగార భరితమైన చిత్రాన్ని రూపొందించిన రాంగోపాల్ వర్మ శ్రేయాస్ ఈటీ యాప్ లో ఈరోజు అనగా జూన్ 27 రాత్రి 9 గంటల నిమిషాలకు విడుదల చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని 6500 మంది ఒక్కొక్కరు చొప్పున 200 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు ట్రైలర్లు, ఒక సాంగ్ కూడా యూట్యూబ్ లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ మూడింటిలో వర్మ చూపించిన శృంగార భరిత సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు ఉన్నాయి. అందుకే 6500 మంది 200 రూపాయలను లెక్కచేయకుండా బుక్ చేసుకున్నారు. నిజానికి తన ఐఫోన్ తో చిత్రీకరణ జరిపిన రామ్ గోపాల్ వర్మ నగ్నం సినిమాని కేవలం ఒక లక్ష రూపాయలతో నే పూర్తి చేశాడు. కానీ శ్రేయాస్ యాప్ లో ఈ సినిమాని బుక్ చేసుకున్న వారి కారణంగా ఇప్పటికే తనకు 13 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చినా రాకపోయినా తనకు నష్టమేమీ లేదు. తనకు వచ్చిన డబ్బుల్లో 20 శాతం అనగా రూ.260000 శ్రేయాస్ ఈటీ తీసుకున్నా... చిత్ర బడ్జెట్ ని తీసివేసినా... రామ్ గోపాల్ వర్మ కి తొమ్మిది లక్షల 40 వేల రూపాయల లాభం వచ్చినట్టే. 


అయితే అతడు ఇటువంటి చిత్రాలను తీసి డిజిటల్ గా విడుదల చేస్తూ తాను మాత్రమే లాభ పడటం లేదు. చిన్నపాటి నిర్మాతలు, దర్శకులు కళాకారులు కూడా పే పర్ వ్యూ విధానాన్ని పాటించి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పకనే చెబుతున్నాడు. ఈయన తీస్తున్న సరస శృంగార చిత్రాలను తీయకపోయినా మంచి కథాబలం ఉన్న సినిమాలను రూపొందించి డిజిటల్ గా తెరకెక్కించి ఎవరైనా డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది టాలెంట్ ఉన్న దర్శకులు థియరిటికల్ రిలీజ్ చేయలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి తెలిసిందే. కానీ రామ్ గోపాల్ వర్మ వాళ్ళందరికీ ఒక సరికొత్త మార్గాన్ని సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్జివి పుణ్యమా అంటూ చాలా మందికి ఏటీటీ... ఎనీ టైం థియేటర్ గురించి ఒక అవగాహన వచ్చింది. అలాగే ఇప్పటికే ఏటీటీ కొద్ది పార్టీ పాపులారిటీ కూడా సంపాదించుకుంది. ఒకవేళ ఈ ఏటీటీ లో మంచి కథాబలం ఉన్న సినిమాలు రిలీజ్ అయితే అవి తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఈ కోణంలో ఆలోచిస్తే ఆర్జీవి డర్టీ పిక్చర్లు తీసినప్పటికీ... అతను ఆ సినిమాలను ప్రేక్షకులకు చేరవేసేందుకు కనిపెట్టిన సరికొత్త బాట ప్రస్తుతం అందర్నీ ఆలోచింపజేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: