తన భార్య ఆలియాకు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లీగల్​ నోటీసులిచ్చారు.​ తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు. బాలీవుడ్​ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియాకు లీగల్​ నోటిసు పంపించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణల విషయంలో ఆమె వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించటానికే ఉద్దేశపూర్వంగా, పక్కాప్రణాళికతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని నటుడు తరఫున న్యాయవాది వెల్లడించారు. తన భర్త నవాజూద్దీన్​ నుంచి విడాకులు కావాలని మే7న కోర్టును ఆశ్రయించారు ఆలియా. అతడికి తనకు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.

 

IHG

 

ఈ మధ్య కాలంలో తమ పిల్లల పాఠశాల ఫీజులను నవాజుద్దీన్​ కట్టడం మానేశాడని ఆలియా ఆరోపించించారు. ఆర్థిక భారం వల్ల తాను చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఖండించిన నవాజ్​ న్యాయవాది.. పిల్లల పాఠశాల రుసుమును అతడు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. మే 6న అలియా విడాకులు కోరుతూ నవాజుద్దీన్‌కు తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. ఈ నోటీసులో మెయింటెనెన్స్‌‌ కింద నెల నెల డబ్బులు చెల్లించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై నవాజుద్దీన్‌ ఇంతవరకు స్పందించలేదని, అతడు డబ్బులు పంపించకపోవడం వల్ల పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేకపోతున్నాని ఆమె  మీడియా ఎదుట వాపోయారు. 

 

IHG


తను నోటీసులో పేర్కొన్నట్లుగానే నెలవారి భత్యం చెల్లిస్తున్నాడు. చెల్లింపుకు సంబంధించిన వివరాలు, స్క్రీన్‌షాట్‌లు కూడా ఉన్నాయి. పిల్లలకు సంబంధించిన ఖర్చులన్నింటినీ  లాక్‌డౌన్‌కు ముందే అలియాకు చెల్లించాడు’ అని చెప్పుకొచ్చాడు. అయిన నవాజుద్దీన్‌కు అతడి కుటుంబానికి పరువు నష్టం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా అలియా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పటి వివాహ బంధాలు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. అందులోను సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ జీవన విధానం మరో సినిమా ను తలపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: