నిన్నటి వరకు మన్మథుడు బిరుదును తెగ ఎంజాయ్ చేసిన నాగార్జునకు ఇప్పుడిది నచ్చడం లేదు. మన్మథుడు అని పిలిస్తే.. హ్యాపీగా ఫీలైన నాగార్జునకు ఈ బిరుదే శాపంగా మారిందా.. అందుకే మన్మథుడు ఇమేజ్ నుంచి బయటపడాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

 

గ్రీకు వీరుడు.. మన్మథుడు అని పిలవాలనుకుంటే.. కరెక్ట్ గా సూట్ అయ్యే పర్సనాలిటీ నాగార్జునది. నిన్నే పెళ్లాడతాలో గ్రీకువీరుడు.. నా రాకుమారుడు అని పాట పెడితే.. సినిమా సూపర్ హిట్ అయింది. మన్మథుడు టైటిల్ తో సినిమా తీస్తే.. నాగ్ కెరర్ లో టాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. 

 

నాగార్జునకు గతంలో కలిసొచ్చిన మన్మథుడు ఇమేజ్ ప్రస్తుతం కలిసి రావడం లేదు. ఆ మధ్య మన్మథుడు 2తో ముందుకొస్తే.. ఈ సారి మాత్రం రిజెక్ట్ చేశారు. దీంతో నాగ్ మనసు మార్చుకొని.. మన్మథుడు ఇమేజ్ నుంచి బయటకు వచ్చేలా సినిమాలు ఎంచుకుంటున్నాడు. 

 

నాగార్జున నటిస్తున్న సినిమా లిస్ట్ చూస్తుంటే.. మన్మథుడు ఇమేజ్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాడనిపిస్తోంది. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆఫీసర్ మూవీ చేశాడు. డ్రస్ ఇమేజ్ ఏదైనా.. ఆఫీసర్ ఇమేజ్ నే నమ్ముకున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న వైల్డ్ డాగ్ మూవీలో ఎన్.ఐ.ఎ ఆఫీసర్ గా నటిస్తున్నాడు నాగార్జున. 

 

లాక్ డౌన్ టైమ్ లో నాగార్జున మరో మూవీ ఓకే చేశాడు. రాజశేఖర్ తో గరుడ వేగ తీసిన ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్ చేశాడు. ఇందులో నాగ్ చీఫ్ సెక్యూటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆ మధ్య ఆఫీసర్.. ప్రస్తుతం వైల్డ్ డాగ్.. త్వరలో ప్రవీణ్ సత్తారు మూవీ. ఇలా డ్రస్ కోడ్ లో తేడా ఉన్నా.. ఆఫీసర్ రోల్స్ నే ఎంచుకుంటూ.. 60ఏళ్ల వయసులో కావాలనే.. మన్మథుడి ఇమేజ్ కు దూరం అవుతున్నాడు నాగార్జున. 

మరింత సమాచారం తెలుసుకోండి: