దిగ్దర్శకుడు దాసరి నారాయణరావు. ఆయన్ని దాసరి అని మూడు అక్షరాలతో కుదించినా నింగిదాకా రెక్కలు చాచుకుంటూ వెళ్ళిపోయే అఖండ ఖ్యాతి ఆయన సొంతం. దాసరి బహుముఖీయమైన ప్రతిభాశాలి. ఆయన అన్ని రకాల జోనర్లలో సినిమాలు తీశారు. ఎందరికో అవకాశం ఇచ్చి నిలబెట్టారు. అటువంటి దాసరి ఇండస్ట్రీ పెద్ద కూడా. మరి దాసరి మరణానంతరం ఆయన కుటుంబంలో కలహాలు పెద్దాయన పరువుని దెబ్బతీస్తున్నాయన్న అభిప్రాయం అందరిలోనూ ఉంది.

IHG

దాసరి ఇద్దరి కొడుకులూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తుకుంటూ దాసరి నాలుగు దశాబ్దాలుగా ఆర్జించిన కీర్తికి మచ్చ తెస్తున్నారన్న భావన అందరిలోనూ ఉంది. దాసరి అంటే ఇంటి పెద్ద. అదే సినీ ఇంటి పెద్ద. అటువంటి మహానుభావుడి కుటుంబం ఇలా రచ్చ పడుతూంటే సర్దిచెప్పాల్సిన  బాధ్యత కచ్చితంగా సినీ పెద్దల మీద ఉందని అంటున్నారు.

IHG

దాసరి పుట్టిన రోజున, వర్ధంతి రోజునా నివాళి అర్పించడం మంచిదే కానీ ఇపుడు దాసరి కీర్తి చంద్రికలకు కాసింత ఇబ్బంది కలుగుతున్న‌ వేళ అంతా కలసి సర్దుబాటు చేయాలి. ముందుగా ఆ పెద్దాయన ఇంటి సమస్యను పరిష్కరిస్తే మొత్తం ఇండస్ట్రీ సమస్యను పరిష్కరించినట్లేనని అంటునారు.

IHG's name was dragged: Dasari Arun Kumar

ఈ విషయంలో  ఇండస్ట్రీలో పెద్దరికం కోసం చూస్తున్న వారు, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటున్న వారు కూడా ఒక్కటిగా ముందుకురావాలి. నిజంగా ఇది సినీ పెద్దలకు ఒక పరీక్ష లాంటిది. ఆ మహానుభావుడి పేరు మరింతగా ఇబ్బందుల్లో పడకుండా అంతా కలసి నచ్చచెప్పి దాసరి కుటుంబం ఒక్కటిగా ఉండేలా చూడాలి. కనీసం గొడవలు పడకుండా చూడాలి. 

IHG

చెప్పడానికి ఇది కష్టమైన బాధ్యతే కానీ మనసుంటే మార్గం ఉంటుంది, కాబట్టి దాసరితో పరిచయం ఉన్న వారు, ఆయన  మా ఇంటి మనిషి అనుకుంటున్న వారు అంతా కూడా ఇపుడు దాసరి ఇంటి పేరుని నిల‌బెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: