ఏ మొగుడు అయినా భార్య చెప్పిన మాట వెంటనే వినడు కదా! ఆఫ్టరాల్ భార్యకు ఎం తెలుసు? ఇంట్లో వంట చేసుకొని పిల్లలకు, భర్త పెట్టి ఉన్నది తను తినే ఆడదానికి ఎం తెలుసు అనేది మగాడి ఆలోచన.. కానీ ఒక్కసారికి కాళ్లకు కట్టిన సంఖ్యలు విడిపించండి.. ఆడది ఏం సాధించగలదో మీకు తెలుస్తుంది అంటుంది మహిళా.

 

ఇంకా ఇలాంటి తరహాలోనే సౌందర్య శ్రీకాంత సినిమా తెరకెక్కింది. అదే కలిసినడుద్దాం రండి. ఈ సినిమాలో శ్రీకాంత్ ఒక చోటా ఉద్యోగం చెయ్యలేడు.. ఎవడి కాళ్ళ కిందో ఎందుకు బతకాలి అని ఉద్యోగం మాని ఓ బిజినెస్ లోకి అడుగుపెడతాడు. అడుగుపెట్టిన ప్రారంభంలో శ్రీకాంత్ కి అంత మంచే జరుగుతుంది. 

 

కానీ పోను పోను ఒకొక్కటి నష్టాలు వస్తాయి. అప్పుడు భార్య చెప్తుంది. తెలియని వాటిలో ఎంత లోతుకు వెళ్లిన.. నష్టాలే వస్తాయ్ అని. కానీ వినడు. ఆఫ్టరాల్ పెళ్ళాంవి.. నువ్వు ఏంటే నాకు చెప్పేది.. నేను సంపాదిస్తా.. నేను బిజినెస్ ఏ చేస్తా.. అని అంటాడు. అప్పుడు సౌందర్య బెట్ కడుతుంది. పెళ్ళాం కూడా ఎంతైనా సంపాదించగలదు అని. 

 

అనుకున్నట్టే అన్ని మెల్లగా ఒకొక్క విషయంలో విజయం సాధిస్తుంది. లాభాలు చూస్తుంది. పెళ్ళాం ఎలా అయితే లాభం చూస్తుందో.. భర్త అలానే నష్టాలు చూస్తాడు. చివరి వరకు భర్త అనే అహంకారం తగ్గదు. కానీ చివరికి తెలుస్తుంది.. భార్య విలువ.. భార్య చేసిన మంచి గురించి. అలా ఈ సినిమాలో సౌందర్య చెప్పిన మాటలు మొదట్లోనే విని ఉంటే అతని జీవితం అద్భుతంగా ఉండేది. కానీ అతను వినలేదు. చివరికి అవమానాలపాలయ్యాడు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: