ప్రమోషన్స్ హడావిడి లేకుండా ఇటీవల డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అయిన చిత్రం కృష్ణ ఆండ్ హిస్ లీల. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది. ఈచిత్రానికి  పాజిటివ్ రివ్యూస్ రావడం తో  ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 4లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఈసినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా భాగస్వామిగా  వుంది. ఇక ఈచిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి అగ్ర హీరో విక్టరీ వెంకటేష్ ,కృష్ణ లీల టీంను ట్విట్టర్ ద్వారా అభినందించాడు. సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను, ఫ్రెష్ రైటింగ్ కు తోడు అందరి నటన బాగుంది .. కంగ్రాట్స్ టీం అంటూ వెంకీ ట్వీట్ చేశాడు.  
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్షణం ఫేమ్ రవికాంత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దా శ్రీనాథ్ , సీరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించారు. చరణ్ పాకాల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. ఇప్పటివరకు డైరెక్ట్ ఓటిటి లో విడుదలైన రెండో స్ట్రెయిట్ తెలుగు మూవీ ఇదే కాగా మొదటి సినిమాగా విడుదలైన అమృతరామమ్ నిరాశపరిచింది. ఇక జులై 3న భానుమతి రామకృష్ణ  కూడా డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుంది. ఆహా ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: