సినిమాల్లో హీరో మాస్ క్యారెక్టర్ చేస్తే సినిమాకు మంచి క్రేజ్ రావడం ఖాయం. మాస్ హీరోలుగా మంచి క్రేజ్ ఉన్న ఏ హీరో ఈ తరహా సినిమాలు చేసినా అభిమానుల స్పందన ఘనంగా ఉంటుంది. అయితే.. ఈ తరహా క్యారెక్టర్లు హీరోయిన్లు అంతగా చేయలేరు. ఊరమాస్ క్యారెక్టర్లతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కంటే కథాపరంగా మాస్ క్యారెక్టర్లు చేసిన హీరోయిన్లు ఉన్నారు. తొంభైల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన రంభ ఇలాంటి మాస్ పాత్రల్లో రాణించింది. ఆమె చేసిన ఊరమాస్ క్యారెక్టర్లలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘మాతోపెట్టుకోకు’ ఒకటి.

IHG

 

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రంభ రిక్షా తొక్కే అమ్మాయిగా కనిపిస్తుంది. సినిమాలో ఆమె మేకోవర్, యాక్టింగ్, డైలాగ్ డిక్షన్, హావభావాలు.. ఇలా మొత్తంగా మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తుంది. గ్లామర్ హీరోయిన్ గా రంభ కెరీర్ మంచి పీక్స్ ఉన్న టైమ్ అది. దీంతో రంభ చేసిన క్యారెక్టర్ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ గా సాగుతుంది. సినిమా కంటెంట్ కూడా మాస్, సెంటిమెంట్ అంశాలతో ఉంటుంది. దీంతో రంభ క్యారెక్టర్ ను మాస్ కోణంలో డిజైన్ చేశారు. బాలకృష్ణ వచ్చినప్పుడు రంభ నటన, రిక్షా గ్యాంగ్ తో చేసే అల్లరి అంతా పూర్తి మాసివ్ గా ఉంటుంది.

IHG

 

సినిమాలోని పాటల్లో కూడా రంభ తనదైన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది. బాలకృష్ణతో ఆమెకు ఉన్న పాటలు కూడా మాసివ్ గానే ఉంటాయి. సినిమాకు రంభ క్యారెక్టర్ హెల్ప్ కాకపోయినా సినిమాలో ఎంటర్ టైన్మెంట్ కు రంభ క్యారెక్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రంభ మాసివ్ అప్పీయరెన్స్ సినిమాకు స్పెషల్ అని చెప్పాలి. భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: