అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత హీరోగా సినిమాలు చేస్తున్నా పెద్దగా వర్క్ అవుట్ కావట్లేదు. ఇక ఈమధ్య హీరోగానే కాకుండా సైడ్ రోల్స్ కూడా చేస్తూ వస్తున్న నవీన్ చంద్ర లేటెస్ట్ గా తను హీరోగా నటించిన భానుమతి రామకృష్ణ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది. జూలై 3న అమేజాన్ ప్రైం లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాలు ఓటిటి రిలీజ్ అవడంపై తన స్పందన తెలియచేశారు నవీన్ చంద్ర. 

 

సినిమా కథ బాగుంటే ఏ ఫ్లాట్ ఫాం లో అయినా సినిమా చూఒస్తారని చెబుతున్నాడు ఈ హీరో. థియేటర్ లు ఇప్పుడప్పుడే తెరచుకునే పరిస్థితి కనబడటం లేదు.. అంతేకాదు చాలా సినిమాలు ఓటిటి రిలీజ్ అవుతున్నాయి. ఆ బాటలోనే తమ సినిమాను కూడా ఓటిటిలో రిలీజ్ చేయదలచుకున్నాం. థియేటర్ లో అయితే రెండోసారి సినిమా చూడాలంటే టికెట్ తీసుకోవాలి.. కాని ఓటిటిలో అలా కాదు. మళ్లీ మళ్లీ చూడాలన్నా సరే ఫ్రీగా చూసేయొచ్చని అంటున్నాడు నవీన్ చంద్ర.

 

అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర హీరోగానే కాదు ఎలాంటి పాత్ర అయినా చేస్తా అంటున్నాడు. హీరో, విలన్ అనే తేడాలు లేవు.. సినిమా కథ.. తన పాత్ర బాగా ఉందని అనిపిస్తే కచ్చితంగా సినిమా చేస్తా అంటున్నాడు నవీన్ చంద్ర. ఇక తనకంటూ డ్రీం రోల్స్ ఏమి లేవని.. అన్ని జానర్ లలో సినిమాలు చేయాలని అంటున్నాడు ఈ హీరో. భానుమత్ రామకృష్ణ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని ఓటిటిలో రిలీజైనా ఈ సినిమా తప్పకుండా ఆడియెన్స్ ఆమోదం పొందుతుందని అంటున్నారు నవీన్ చంద్ర.                

మరింత సమాచారం తెలుసుకోండి: