తెలుగు చిత్ర దర్శకులలో శేఖర్ కమ్ముల దారి ప్రత్యేకం. ఆయన ఎంచుకునే సబ్జెక్టులు ప్రేమ కథలే అయినా తెరకెక్కించే విధానం చాలా కొత్తగా ఉంటుంది. సున్నితమైన ప్రేమకథల్ని ఎంతో అందంగా చూపించడం ఆయనకే చెల్లింది. ఆయన సినిమాలో ఫైట్స్ ఉండవు. పేజీలకి పేజీలు డైలాగ్స్ ఉండవు. కానీ ఆయన సినిమాల్లోని మాటలి మనసు మీద చెరగని ముద్ర వేస్తుంటాయి. సీన్లు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి.

 

హ్యాపీడేస్ సినిమా నుండి మొదలుకుని మొన్నటి ఫిదా వరకు ఆయన ప్రయాణం అద్భుతం. అయితే శేఖర్ కమ్ముల ఎంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా కూడా, ఇప్పటి వరకూ స్టార్ హీరో సినిమా చేయలేదు. సాధారణంగా మొదటి రెండు సినిమాలు హిట్ అనిపించుకోగానే స్టార్ హీరో కోసం ఎదురుచూస్తుంటారు. కానీ శేఖర్  కమ్ముల కేరీరర్లో ఎన్నో హిట్లు ఉన్నా కూడా స్టార్ హీరోతో ఎందుకు పనిచేయలేదో అర్థం కాదు.

 

అయితే గతంలో మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. కానీ అదెందుకు ముందుకు కదలలేదో తెలియదు. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల మొట్టమొదటి సారి స్టార్ హీరోతో సినిమాకి రెడీ అవుతున్నాడని టాక్. నాగ చైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన లవ్ స్టోరీ తర్వాత విక్టరీ వెంకటేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట. ప్రస్తుతం షూటింగులు లేక ఫ్రీగా ఉండడంతో స్క్రిప్టు రాసే పనిలో ఉన్నాడని సమాచారం.

IHG

ఈ సినిమాని లవ్ స్టోరీ చిత్ర నిర్మాతలైన ఏషియ‌న్ సినిమాస్ అధినేత‌ సునీల్ నారంగ్‌తో క‌లిసి పి.రామ్‌మోహ‌న్ రావు నిర్మించనున్నారట. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. వెంకటేష్ నారప్ప సినిమా షూటింగ్ ముగిసిన అనంతరం వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం కలదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: