ఐశ్వర్య రాజేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్న ఈమె..  సన్ టీవీలో అస్తోపోవధ్ యారు అనే కామెడీ షోలో యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టింది. మనాడా మయిలాడ అనే రియాలిటీ షో గెలుచుకున్న తర్వాత ఆమెకు 2011లో అవగాళమ్ ఇవర్గలం సినిమాలో ఫ్రెండ్ పాత్ర పోషించింది. ఆ తర్వాత అట్టాకత్తి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ్నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఐశ్వర్య రాజేష్. పేరుకు తమిళ హీరోయిన్ అయినా కూడా ఈమె అచ్చ తెలుగమ్మాయి. 

IHG' review: A tiresome film, despite good ...

ఇక ఈ భామ అటు తమిళంలో నటిస్తూనే తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ భామ ఇటీవల తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వస్తోన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌లో నటించి మరోసారి తనెంటో నిరూపించుకుంది. ఈ మూవీలో సువర్ణ అనే ఊర‌మాస్, డీ గ్లామర్‌, మధ్య తరగతి గృహిణి పాత్రలో అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో న‌ట‌న ప‌రంగా  విజయ్‌కే పోటీ ఇచ్చిన ఐశ్వర్య రాజేష్. అయితే ఈ సినిమా ఐశ్వర్య రాజేష్‌ది మాస్ క్యారెక్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ.. చాలా సాఫ్ట్‌గా న‌టించింది ఆక‌ట్టుకుంది.

IHG

మిగ‌తా హీరోయిన్ల‌తో పోలిస్తే.. ఐశ్వర్య రాజేష్ తన పెర్ఫామెన్స్ ప్రేక్ష‌కుల‌ను కట్టిపడేసింది. తనకంటే ఎక్కువ చదుకున్నానంటే భర్త అహం ఎక్కడ దెబ్బతింటుందోనని నిజాన్ని దాచి.. అదే భర్త చదువుకుని మోడ్రన్‌గా ఉండే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని గోల్డ్ మెడల్ సాధించి మోడ్రన్‌గా రెడీ అయ్యే సీన్‌లో ఐశ్వర్య రాజేష్ తాను ఏడుస్తూనే ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. కాగా, ఐశ్వ‌‌ర్య అంతకుముందు కౌసల్యా కృష్ణమూర్తి సినిమాలో క్రికెటర్‌‌ పాత్రలోనూ మెప్పించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: