ఇప్పుడు మన తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్ శృతి హాసన్. తండ్రి ఇమేజ్ తో సినిమాల్లోకి వచ్చిన ఆమె ఇప్పుడు వరుస అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు అవకాశాల కోసం చాలానే కష్టపడుతుంది అనే చెప్పాలి. ఆమెను చాలా వరకు దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోవడం లేదు అని చెప్పాలి. అయితే స్టార్ హీరోలతో ఆమె తనకు ఉన్న పరిచయాలతో అవకాశాల కోసం ఆమె ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టింది. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఆమె చేసే సినిమాలు మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఆమె తెలుగు లో పవన్ కళ్యాణ్ హీరో గా చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఆ సినిమాలో ఆమె పాత్రకు చాలా మంచి మార్కులు పడ్డాయి. పవన్ కళ్యాణ్ హీరో కావడం తో ఆమెకు కూడా చాలా మంచి ఇమేజ్ వచ్చింది అనే చెప్పాలి. ఆ సినిమాలో ఆమె పాత్రకు మాస్  చాలా మంది ఆమెను కొనియాడారు. పవన్ పక్కన సరిగా సెట్ అయింది అని అన్నారు.

 

అయితే ఆమె చేసిన మరో సినిమా కాటమరాయుడు లో మాత్రం ఆమె పాత్ర పై చాలా విమర్శలు వచ్చాయి. ఆమె ధరించిన దుస్తులు కోటీ మార్కెట్ లో కొన్నారా అంటూ చాలా మంది కామెంట్స్ చేసారు. ఇక శ్రీమంతుడు సినిమాలో ఆమె పాత్రకు మంచి ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఆమె తెలుగు లో సినిమాల కోసం చాలా బాగా ఎదురు చూస్తుంది గాని ఆమెను పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్తున్నారు టాలీవుడ్  జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: