తెలుగు సినిమాల్లో పదేళ్లకు పైగా తెర వెనుక టెక్నీషియన్ గా తెర ముందు చిన్న చిన్న పాత్రలతో రాణించిన వ్యక్తి రవితేజ. కెరీర్లో మాస్ సినిమాలే ఎక్కువగా చేసిన రవితేజ ఆ విషయంలో బాగా సక్సెస్ అయ్యాడు. రవితేజ మాస్ అప్పీయరెన్స్ కి ఫ్యాన్స్ ఎక్కువ. తాను చేసే కామెడీలో, టైమింగ్ లో పక్కా పర్ఫెక్షన్ చూపించడమే రవితేజ సక్సెస్ మంత్రం. రవితేజ చేసిన అటువంటి పక్కా మాస్ మూవీస్ లో ఒకటి ‘బలుపు’. ఈ సినిమా విడుదలై నేటికి 7ఏళ్లు పూర్తయ్యాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2013 జూన్ 28న విడుదలైంది.

IHG

 

సినిమాలో కామెడీకి కొదవ ఉండదు. బ్రహ్మానందంతో కలిసి రవితేజ చేసిన కామెడీ సినిమాకు హైలైట్. వీరిద్దరి కాంబినేషన్ ఎంతటి కామెడీ చేయగలదో అంత తీసుకున్నాడు దర్శకుడు. యాక్షన్ లో సినిమా ఆకట్టుకుంటుంది. యాక్షన్, కామెడీని మిక్స్ చేసి సినిమాను సూపర్ హిట్ చేశాడు దర్శకుడు. సినిమాలో రవితేజ కామెడీ టైమింగ్, మాస్ అప్పీయరెన్స్ అన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమాలో బ్రహ్మానందం సెకండ్ హీరో అంటే అతిశయోక్తి కాదు. ఫస్టాప్ కామెడీ, సెకండాఫ్ యాక్షన్ చూపించడంతో ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్మెంట్ లభించింది.

IHG

 

కథలో కొత్తదనం కాకపోయినా స్క్రీన్ ప్లే సినిమాకు ప్రాణం అని చెప్పాలి. కోన వెంకట్, బాబీ కథను అందించారు. కోన వెంకట్ మాటలు సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతంలోని పాటలన్నీ హిట్టే. ప్రకాశ్ రాజ్, అశుతోష్ రాణా పాత్రలు కూడా సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ పండిస్తాయి. క్లైమాక్స్ లో ఫైట్ బదులు విలన్లతో కామెడీ చేయించడం కొత్తగా అనిపించింది. పీవీపీ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: