లవర్ బోయ్ నితిన్ అటు యువ హీరోలకు ఎక్కువ.. స్టార్ ఇమేజ్ కు తక్కువ అన్నట్టుగా ఓ మోస్తారు క్రేజ్ తో కెరియర్ కొనసాగిస్తున్నాడు. వరుసగా 14 సినిమాల ఫ్లాపుల తర్వాత ఇష్క్ సినిమాతో మళ్లీ కెరియర్ ను ట్రాక్ లో పెట్టుకున్నాడు నితిన్. అతను కాబట్టి అన్ని ఫ్లాపులు వచ్చినా నిలబడ్డాడు అదే వేరే వాళ్లైతే సినిమాలు ఆపేసేవారని చెప్పొచ్చు. ఇప్పటికి ఒక హిట్టు రెండు ఫ్లాపులు అన్నట్టుగా కెరియర్ సాగిస్తున్న నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. భీష్మ హిట్ తో జోష్ కనబరుస్తున్న నితిన్ రంగ్ దే పాటుగా చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

 

ఇక ఈ రెండు సినిమాల తర్వాత కృష్ణ చైతన్య కాంబినేషన్ లో పవర్ పేట సినిమా చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నితిన్ 3 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. బాహుబలి తర్వాత రెండు భాగాలుగా వచ్చిన ఎన్.టి.ఆర్ బయోపిక్ డిజాస్టర్ గా మిలిగింది. ఇక ఇప్పుడు పవర్ పేట సినిమా కూడా అలానే రెండు పార్టులుగా తెరకెక్కిస్తారని తెలుస్తుంది.

 

అంతేకాదు ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సినిమా కథ, కథనాలు చాలా కొత్తగా ఉంటాయట. పిరియాడికల్ మూవీగా తెరకెక్కే ఈ సినిమాలో 1960 నుండి 2020 వరకు కథ నడుస్తుందట. ఈ పిరియడ్ గ్యాప్ లో మూడు డిఫరెంట్ రోల్స్ లో నితిన్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఎప్పుడు లవర్ బోయ్ గా ఫీల్ గుడ్ మూవీస్, లవ్ స్టోరీస్ చేసిన నితిన్ ఈసారి సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: