రాజమౌళికి మహాభారతం డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే.. పూరీ జగన్నాథ్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన. స్క్రిప్ట్ రాసుకొని చాలా కాలం అయింది. ఈ సినిమాను మహేశ్ తో తీయాలనుకుంటే.. కథ వినే ఛాన్స్ ఇవ్వలేదు. మరి ఈ కలల చిత్రాన్ని ఏ హీరోతో తీస్తాడో అనే ఉత్కంఠ సగటు ప్రేక్షకుడిలో నెలకొంది. 

 

జనగణమన కథ అనుకున్నప్పుడే పూరీ మదిలో మెరిసిన హీరో మహేశ్. పోకిరి రిలీజ్ అయి పదేళ్లయిన సందర్భంగా మహేశ్ తో జనగణమన ఎనౌన్స్ చేశారు. ఈలోగా పూరీ భయంకరమైన ఫ్లాపుల్లో ఉండటంతో.. కథ వినే ఛాన్స్ పూరీకి మహేశ్ ఇవ్వలేదు. అయితే ఇస్మార్ట్ హిట్ తర్వాత పూరీ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మహేశ్ కంటే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇష్టమన్నాడు. మహేశ్ ఛాన్స్ ఇస్తే చేస్తారా.. అని అడిగితే తనకు కూడా క్యారెక్టర్ ఉంటుందనీ చెప్పడంతో.. ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఉండదని తేలిపోయింది. 

 

పూరీ మహేశ్ మధ్య మూసుకుపోయిన తలుపులను సూపర్ స్టార్ ఆ మధ్య తెరిచాడు. లాక్ డౌన్ టైమ్ లో ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో పూరీ టాపిక్ వచ్చింది. పూరీ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని ఓ అభిమాని అడిగితే.. పూరీ కథ ఎప్పుడు చెబుతాడా.. అని ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాననీ చెప్పాడు మహేశ్. దీంతో పూరీ, మహేశ్ కాంబినేషన్ కు తలుపులు తెరుచుకున్నాయి.

 

లాక్ డౌన్ సమయంలో పూర జనగణమన స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. పాన్ ఇండియా మూవీగా తీస్తానని ఎనౌన్స్ చేశాడు. అయితే హీరో ఎవరో చెప్పలేదు. దీంతో జనగణమన హీరో ఎవరంటూ.. చర్చ మొదలైంది. కథ ఎప్పుడు వినిపిస్తాడా.. అని మహేశ్ ఎదురు చూస్తున్నాననీ.. ఆ మధ్య చెప్పడంతో.. సూపర్ స్టార్ కు చెప్పడానికే.. జనగణమన కథను బయటకు తీసుకొచ్చాడా.. అనిపిస్తోంది. లేదంటే పూరీ మైండ్ లో నుంచి మహేశ్ ను చెరిపేసి.. ఇంకో హీరోను ఎవరినైనా అనుకుంటున్నాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: