ఎప్పుడైనా వాయిదా పడితే ఒకటి రెండు సినిమాలు వాయిదా పడతాయి. కరోనా సీజన్ లో సినిమాలన్నీవాయిదా పడ్డాయి. ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేకపోతున్నారు. సమ్మర్.. సంక్రాంతి.. దసరా. ఇలా మూడు సీజన్స్ మిస్ కావడంతో.. తెలుగు ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. ఒకవేళ పరిస్థితులు సద్దుమణిగి థియేటర్స్ తెరిచినా.. ఈ ఏడాది పెద్ద హీరో మూవీ లేనట్టే. 

 

కరోనా వచ్చింది.. కాస్త హడావిడి చేసి వెళ్లిపోతుందిలే అనుకున్నారంతా. కానీ ఇలా తిష్టవేసుకొని కేసుల సంఖ్య పెంచుకుంటూ పోతుందని ఎవరూ అనుకోలేదు. కరోనా కాటుకు సినిమా ఇండస్ట్రీ కుదేలైపోయింది. థియేటర్స్ ఇప్పట్లో తెరవరన్న సంగతి అర్థమైపోయింది. షూటింగ్స్ కు పెద్ద హీరోలు సామాజిక దూరం పాటిస్తున్నారు. ఈ లెక్కన ఈ ఏడాది వచ్చే పెద్ద హీరో ఒక్కరూ కనిపించడం లేదు. సంక్రాంతికి వచ్చిన మహేశ్.. బన్నీ సినిమాలతో ఈ ఇయర్ ముగుస్తోంది. 

 

కరోనా సినిమా పరిశ్రమను కుదేలు చేసింది. ఈ ఏడాది ఫస్ట్ ఆఫ్ లో మే 15న రావాల్సిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇంకా 30రోజుల షూటింగ్ జరగాల్సి ఉంది. షూటింగ్స్ కు పర్మీషన్ రాగానే.. దసరాకు రిలీజ్ చేద్దామనుకుంటే.. ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ లెక్కన ఈ ఏడాది సమ్మర్ లో రావాల్సిన వకీల్ సాబ్ ప్రస్తుతానికి సంక్రాంతి వైపు చూస్తున్నాడు. 

 

ఈ ఏడాది సెకండ్ ఆఫ్ లో రెండు పెద్ద హీరోల సిినిమాలు రావాల్సి ఉంది. ఆగస్ట్ 15న ప్రభాస్ రాధే శ్యాం.. దసరాకు చిరంజీవి ఆచార్యను రిలీజ్ చేద్దామనుకుంటే.. వచ్చే ఏడాది ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి. దసరా మిస్ అయినా.. సంక్రాంతికి ఆచార్య తీసుకొచ్చేలా నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేసినా.. చిరంజీవి వయసు రీత్యా ఇప్పట్లో షూటింగ్ కు వెళ్లే అవకాశం లేదు. ఈ ఏడాది పెద్ద సినిమాలు లేనట్టే. కేవలం ఇద్దరే స్టార్స్ మహేశ్.. బన్నీతో మాత్రమే వచ్చిన ఏడాదిగా 2020 నిలిచిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: