39 ఏళ్లు వచ్చినా సరే ఇప్పటికి కుర్ర కారుని ఉర్రూతలూగించేలా చేస్తున్న బెంగాలీ భామ రియా సేన్ ఇప్పటికి తన హాత్ ఫోటో షూట్స్ తో దుమ్ముదులిపేస్తుంది. తనని తాను ఎప్పుడు హాట్ గా ప్రెజెంట్ చేసుకునేందుకు ఇష్టపడే రియా సేన్ మోడల్ అవక ముందు నుండే గ్లామర్ గా కనిపించేదట. అసలు చెప్పాలంటే స్కూల్ వయసులోనే తనకి సెక్సీ, బోల్డ్ ట్యాగ్స్ వచ్చాయని అంటుంది. 16 ఏళ్లకే అలా పిలిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో తెలుసని అంటుంది రియా సేన్.

 

తెలుగులో ఒకటి రెండు ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. బాలీవుడ్ లో అమ్మడు తన అందంతో అలరించే ప్రయత్నం చేసింది. ఒరియా, బెంగాలి సినిమాల్లో కూడా నటంచి మెప్పించింది రియా సేన్. తనని తాను హాట్ గా ప్రెజెంట్ చేసుకోవడంలో ఎప్పుడు ముందు ఉండే ఈ ముద్దుగుమ్మ ఇది ఇప్పటిది కాదు చిన్నప్పటి నుండి తను అందంగా కనిపించాలనే ఆలోచనతో ఎక్కువ కేర్ తీసుకుంటానని చెప్పింది. అయితే ఎప్పుడూ సెక్సీగా కనిపించాలంటే అందుకు తగ్గ ఫిజిక్ మెయింటైన్ చేయాలని.. దానికి చాలా ఫిట్ నెస్ అవసరమని అంటుంది అమ్మడు.

 

ఎలా పడితే అలా.. ఏది పడితే అది తింటే తనలా ఉండటం కష్టమని.. డైట్ విషయంలో ఫుల్ కంట్రోల్ గా ఉంటేనే తనలా సెక్సీగా ఉంటారని చెబుతుంది రియా సేన్. సిని కెరియర్ ఎలా ఉన్నా యాడ్స్ తో పాటుగా సోషల్ మీడియాలో అమ్మడు బాగా యాక్టివ్ గా ఉంటుంది. సరైన ఛాన్స్ రాక చేయట్లేదో లేక కావాలని గ్యాప్ ఇచ్చిందో కాని అమ్మడు ఛాన్స్ వస్తే మళ్లీ వెండితెర మీద వెలుగు వెలగాలని అనుకుంటుంది. మరి రియా సేన్ కు మళ్లీ ఛాన్సులు వచ్చి కెరియర్ సరైన ట్రాక్ లో పడాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: