మన  తెలుగు హీరోల వయసు ఎంత అంటే పాతికేళ్ళే. ఎప్పటికీ అదే ఏజ్. ఎందుకంటే వారు మనవల తండ్రులు అయినా కూడా వెండితెర మీద వారి పాత్ర వయసు అంతే కాబట్టి వారు అలాగే ఉంటారు. అలాగే ఫీల్ అవుతారు. ఇక వారి ఫ్యాన్స్ సైతం తమ హీరోలను ముసలాళ్ళు అంటే అసలు ఒప్పుకోరు. 

IHG

ఇపుడు టాలీవుడ్ లో సీనియర్ హీరోలంతా కూడా స్వీట్ సిక్స్టీ లో ఉన్నారు. నిన్ననే బాలయ్య తన అరవయ్యవ పుట్టినరోజును జరుపుతున్నారు. నాగార్జున గత ఏడాడే షష్టి పూర్తి  చేసుకున్నారు. ఇక అయిదేళ్ల క్రితం సినిమా స్టార్లు, ప్రముఖుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి కూడా అరవయ్యేళ్ల పండుగను జరుపుకున్నారు.

IHG

ఇవన్నీ ఇపుడు ఎందుకు అంటే వీరి డేట్ ఆఫ్ బర్తులు ఇపుడు ఎవరికీ అవసరం లేదు కానీ కరోనా వేళ లాక్ డౌన్ విధించి ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వాలు షూటింగులకు అనుమతి ఇస్తూ అరవై దాటిన వారు పాల్గోరాదని కండిషన్లు పెట్టింది. దీంతో సీనియర్ హీరోలు నో షూటింగ్ అయింది. అయితే ఇపుడు టాలీవుడ్లో సీనియర్ హీరోలెవరూ షూటింగులు అంటే వద్దు అంటున్నారు. వాక్సిన్ వస్తే తప్ప షూటింగు వద్దు అంటున్నారు. ఇక వారి కంటే చిన్న అయిన వారు యాభైల్లో ఉన్న హీరోలు కూడా సినిమా షూటింగ్ ఇప్పట్లో వద్దు అంటున్నారుట. 

IHG

యంగర్ జనరేషన్ హీరోల్లో కూడా ఇద్దరు టాప్ రేంజి హీరోలు తాము ఇపుడు షూటింగులకు రాలేమని కబుర్లు పంపుతున్నారు. నిజానికి పేరుకు సీనియర్ హీరోలు అంటున్నా ఎవరూ కూడా షూటింగులకు వెళ్ళే చాన్సే లేదు. మరో వైపు కేసీయార్ సర్కార్ మళ్ళీ ఫుల్ లాక్ డౌన్ పెట్టేలా ఆలోచన చేస్తోంది. దాంతో ఇపుడే మొదలైన షూటింగులు కూడా ఆగేలా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: