కరోనా వల్ల ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు ఓటిటిలను ఆశ్రయిస్తున్నారు. అన్ని భాషల నుండి పలు సినిమాలు ఇప్పటికే డైరెక్ట్ గా ఓటిటిల్లోకి విడుదలకాగా బాలీవుడ్ నుండి త్వరలో మరో 7 కొత్త సినిమాలు థియేటర్ విడుదల లేకుండా డిస్నీ+హాట్ స్టార్ లో విడుదలకానున్నాయి. అందులో స్టార్ హీరోల సినిమా లు కూడా వున్నాయి. ఇక ఆ సినిమాల విషయానికి వస్తే దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  నటించిన చివరి చిత్రం దిల్ బెచార జులై 24న స్ట్రీమింగ్ లోకి రానుందని హాట్ స్టార్ ఇటీవలే ప్రకటించింది. ఈసినిమా కాకుండా తాజాగా మరో 6సినిమాలు కూడా త్వరలోనే స్ట్రీమింగ్ లోకి రానున్నాయి. 
 
అందులో మచ్ అవైటెడ్ మూవీ లక్ష్మి బాంబ్ కూడా వుంది. అక్షయ్ కుమార్ నటించిన ఈచిత్రం బ్లాక్ బాస్టర్ మూవీకి కాంచన కు రీమేక్ గా తెరకెక్కింది. ఆగస్టు లో ఈ సినిమాను హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.  ఈసినిమా తోపాటు స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన భుజ్ ది ప్రైడ్ అఫ్ ఇండియా, సంజయ్ దత్ , ఆదిత్య కపూర్ ,ఆలియా భట్ నటించిన  సడక్ 2, అభిషేక్ బచ్చన్, ది బిగ్ బుల్ తోపాటు ఖుదాఫీజ్ ,లూట్ కేస్ సినిమాలను డిస్నీ +హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. తమ సినిమాలను విడుదలను రేపు  హాట్ స్టార్ వేదికగా అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ ,అభిషేక్ బచ్చన్, ఆలియా భట్ లు అధికారికంగా ప్రకటించనున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: