గత అధ్యక్ష ఎన్నికలలో అమెరికా రిపబ్లికన్ పార్టీ నుండి బరిలోకి దిగిన డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం రాజకీయ నైపుణ్యం లేకుండా అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించడం జరిగింది. వ్యాపార రంగంలో అనేక విజయాలు సాధించి పోటీచేసిన డోనాల్డ్ ట్రంప్ గెలవటం సొంత పార్టీ రిపబ్లికన్ లకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. అటువంటి డోనాల్డ్ ట్రంప్ ఈ సారి నవంబర్ లో జరగబోయే ఎన్నికలలో ఓటమి పాలు అవుతున్నట్లు ముందే ఎన్నికల ప్రచారంలో ఒప్పుకోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. పూర్తి విషయంలోకి వెళితే దేశంలో కరోనా విధ్వంసం మరోపక్క అదుపులేని నిరుద్యోగం అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థ ఇలా అనేక సమస్యలు కళ్లముందు ఉండటంతో డోనాల్డ్ ట్రంప్ కు నిర్వేదం లోకి వెళ్ళిపోయినట్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

 

ఇంటర్నేషనల్ బిజినెస్ మాన్ గా దేశవిదేశాల్లో విజయాలు సాధించి అక్కడినుంచి నేరుగా రాజకీయ రంగంలో అడుగు పెట్టి అత్యున్నత పదవిని అమెరికాలో సాధించిన డోనాల్డ్ ట్రంప్ లో గతంలో ఉన్న ఆత్మవిశ్వాసం కరువై పోయినట్లు చాలామంది లెక్కలు బేరీజు వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ రంగంలో అయినా విజయం సాధించాలనే పట్టుదల కలిగిన డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఇటీవల చోటుచేసుకున్న కరోనా వైరస్ విపత్తుకు ఎన్నడూ లేని విధంగా నిరాశలో కి వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

నవంబర్ లో జరగబోయే అధ్యక్ష ఎన్నికలను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నయి. సరిగ్గా మాట్లాడటం కూడా చేతగాని జోబిడెన్ ఈసారి గెలుస్తాడు అని… తనపై అమెరికా ప్రజలకు సానుభూతి కలిగే విధంగా డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో నల్లజాతీయుల గొడవ మరియు వైరస్ ఎఫెక్ట్ తో అధ్యక్షుడిగా భయంకరమైన ఒత్తిడి ఎదుర్కొనటం వలనే డోనాల్డ్ ట్రంప్ కి అమెరికా అధ్యక్ష పదవిపై మోజు తగిపోయింది అన్న టాక్ నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: