మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో రూపొందుతున్న 152వ సినిమా ఆచార్య జస్ట్ మూడు నెలల్లోనే పూర్తి చేసి ఈ ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనుకున్నారు. ఈ విషయం చిరంజీవి కొరటాలకి చాలా గట్టిగాను చెప్పారు. అయితే కారోనా తో పరిస్థితులు అనుకూలించలేదు. ఇప్పటివరకు కేవలం 40 శామతం మాత్రమే చిత్రీకరణ జరగడంతో 2020 లో ఆచార్య ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం ఎట్టిపరిస్థితుల్లోను అయ్యో పని కాదని చిత్ర బృందం 2021 సంక్రాంతికి అని సన్నాహాలు చేస్తున్నారు. 

 

ఇక ఇన్నాళ్ళు లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగానే లూసీఫర్ రీమేక్ ని మొదలు పెట్టాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే అవకాశం సాహో దర్శకుడు సుజీత్ కు ఇచ్చారు. ఇక సుజీత్ లూసీఫర్ కథను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు స్క్రిప్ట్ లో పలు మార్పులు చేర్పులను చేశాడట. 

 

స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి అవ్వడంతో ప్రస్తుతం సాయి మాధవ్ బుర్రా డైలాగ్ వర్షన్ ను సిద్దం చేస్తున్నాడట. ఇక ఒరిజినల్ వర్షన్ లో మంజు వారియర్ చేసిన పాత్రను తెలుగులో ఎవరితో చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విజయశాంతి, సుహాసిని తో పాటు పలువురి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కాస్టింగ్ గురించి చిత్ర యూనిట్ ఆలోచించలేదని సమాచారం.

 

అంతేకాదు ఆచార్య కంప్లీట్ అయ్యాకే లూసీఫర్ రీమేక్ మొదలు పెట్టాలని కూడా చిత్ర బృందం అనుకుంటున్నారట. ఇప్పటికే మొదలు పెట్టిన సినిమా కంప్లీటవక చిత్ర యూనిట్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అలాంటప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ని మొదలు పెట్టి రిస్క్ లో పడటం ఎందుకని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: