అజ్ఞాతవాసి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,వకీల్ సాబ్ తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లేదా సెప్టెంబర్ లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. ఇదిలావుంటే ఈసినిమాకు లీకుల బెడద తప్పడం లేదు. సినిమా షూటింగ్ ప్రారంభమైన రోజునే సెట్ లోనుండి  పవన్ కళ్యాణ్ పిక్ బయటికి వచ్చింది దాంతో క్షణాల్లో ఆపిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఇక తాజాగా మరో పిక్ కూడా లీక్ అయ్యింది. కోర్టు సీన్ లో పవన్, లాయర్ గెటప్ లో వున్న పిక్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా హల్ చల్ చేస్తుంది ఆ పిక్ లో అంజలి కూడా వుండడం తో ఆ పిక్ సినిమాలోనీదే అంటున్నారు నెటిజన్లు అయితే విఎఫ్ఎక్స్ చేస్తున్న క్రమంలో వీడియోలో వున్న పిక్ లీక్ అవ్వడం తో నిర్మాతలకు టెంక్షన్ స్టార్ట్ అయ్యింది మరి ఆపిక్ ఎలా బయటికి వచ్చింధో తెలుసుకొని ఇక మీదటనైనా మేకర్స్ జాగ్రత్త పడితే మంచింది.
 
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అలాగే సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈసినిమాతో పాటు పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈచిత్రానికి విరూపాక్ష అనే టైటిల్ ప్రచారంలో వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: