యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల్లో రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ కూడా ఒక‌టి. 1992లో విజ‌య‌ల‌క్ష్మీ ఆర్ట్స్ మూవీస్ బ్యాన‌ర్‌పై టి. త్రివిక్ర‌మ‌రావు ఈ సినిమాను నిర్మించారు. బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ముందుగా త‌మిళ్‌లో హిట్ అయిన చంటి సినిమాను బాల‌య్య‌తో తెర‌కెక్కించాల‌ని అనుకున్నారు. అయితే ఈ సినిమా రైట్స్ అప్పటికే కేఎస్‌. రామారావు కొని వెంక‌టేష్‌తో తీస్తున్నార‌ని తెలియ‌డంతో చివ‌ర‌కు ఏ క‌థ‌తో సినిమా తీయాలా ? అని ఆలోచిస్తున్న‌ప్పుడు ఆంజ‌నేయ పుష్పానంద్ తీసుకు వ‌చ్చిన ఈ క‌థ‌ను బాల‌య్య‌తో తీయాల‌ని డిసైడ్ అయ్యారు.

 

పుష్పానంద్ అప్ప‌టికే రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ అని టైటిల్ పెట్ట‌డంతో పాటు స్క్రీన్ ప్లే కూడా చాలా వ‌ర‌కు డ‌వ‌ల‌ప్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత దీనిని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కొంత వ‌ర‌కు డ‌వ‌ల‌ప్ చేసి.. సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చారు. ఇక సినిమాలో విలన్ మోహన్ రాజ్ పాత్ర బాలకృష్ణ పాత్రతో పోలీస్ స్టేషన్లోనే గొడవపెట్టుకునే సన్నివేశాన్ని పుష్పానంద్ రాసినప్పుడు విలన్ ఎంత మాట్లాడుతున్నా హీరో పట్టించుకోకుండా టీ తాగుతూ, స్టైల్ గా సిగరెట్ వెలిగించేలా రాశారు. 

 

విల‌న్ రెచ్చిపోతే హీరోగా మౌనంగా ఉండ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌ద‌ని ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ భావించారు. అయితే అప్పుడు వాళ్లు "యూనిఫాం తీసేస్తే నీకన్నా పెద్ద రౌడీనిరా", "ఏ సెంటర్లో కొట్టుకుందాం? శరత్, సంగం" వంటి డైలాగులు రాయ‌గా అవి సూప‌ర్ హిట్ అయ్యాయి. బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ యాక్టింగ్‌, విజ‌య‌శాంతి - బాల‌య్య కాంబినేష‌న్‌, పంచ్ డైలాగులు, బ‌ప్పీల‌హ‌రి సాంగ్స్ అన్ని సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఈ సినిమాను ప్రేక్ష‌కులు విప‌రీతంగా ఆదిరించారు. కొన్ని చోట్ల సిల్వ‌ర్ జూబ్లీలు.. మ‌రికొన్ని చోట్ల 200, 250 రోజులు ఆడిన రౌడీ ఇన్‌స్పెక్ట‌ర్ ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: