చిరంజీవి ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో రాయబారాలు నిర్వహించి షూటింగ్ లకు అనుమతులు తీసుకు రావడంతో తక్కువ మంది యూనిట్ సభ్యులతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటే షూటింగ్స్ చేసుకోవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. ఈ పరిస్థితుల మధ్య ఇరవై ముప్పయ్ మంది సిబ్బందితో చేసిన టీవీ సీరియల్స్ షూటింగ్‌ లోనే పలువురు నటులు ఇతర బృందానికి కరోనా సోకడంతో కరోనాను పట్టించుకోకుండా షూటింగ్ లు చేయడం అంతసాధ్యం కాదని ఇండస్ట్రీ వర్గాలకు అర్ధం అయిపోయింది.


దీనితో అప్పటివరకు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ లాంటి భారీ సినిమాలతో పాటు ప్రభాస్ అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ప్లాన్స్ అన్నినిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే ఈసినిమాల దర్శకులు పరిస్థితులను ఎదిరించి షూటింగ్స్ చేయడానికి ధ్యైర్యం చేస్తున్న ఈ మూవీల హీరోలు ఎవరు కూడ ముందుకు రాకపోవడంతో ఏమిచేయాలో తెలియని అయోమయ స్థితిలో రాజమౌళి కొరటాల సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్స్ ఉన్నారు.  


‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ మొదలు పెట్టడానికి రాజమౌళి ఎన్నో స్కెచ్‌లు వేసాడు. మాక్ షూట్ చేసి అందరిలోను నమ్మకం పెంచాలని రాజమౌళి ప్రయత్నించినా ఆఖరికి అతడి మాటను కూడ చరణ్ జూనియర్ లు వినలేదు అని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులలో హైదరాబాద్‌ లో ఉండే హీరోలే షూటింగ్‌ కి ససేమీరా అంటే ఇక పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి హోటల్స్ ఉండి షూటింగ్ లో పాల్గొనవలసిన స్టార్స్ ఎలా అంగీకరిస్తారు అని అంటున్నారు.


దీనితో సెప్టెంబర్ వరకు షూటింగ్స్ మొదలయ్యే పరిస్థితేలేదని కొందరు అంటుంటే సెప్టెంబర్ నాటికి భారతదేశంలో 20 కోట్ల కరోనా కేసులు రావచ్చని ప్రముఖ వైరస్ వ్యాధుల నిపుణులు డాక్టర్. జయప్రకాష్ మలీన్ చేస్తున్న అంచనాలతో ఇక ఈ సంవత్సరం ఇండస్ట్రీలో అసలు షూటింగ్ లే మొదలుకావు అన్నఅంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోలను నమ్ముకున్న రాజమౌళి కొరటాల సుకుమార్ లాంటి దర్శకుల పరిస్థితి ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు టాప్ దర్శకుల పరిస్థితి పై సానుభూతి చూపెడుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: