ఇండియన్‌ స్క్రీన్ మీద మాస్ ఇమేజ్‌ ఉన్న హీరోలందరూ పోలీసు పాత్రలో అలరించారు. బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ నుంచి ఈ జనరేషన్ యంగ్ హీరోల వరకు సూపర్‌ కాప్‌ క్యారెక్టర్‌లో అలరించిన వారే. అయితే అమితాబ్‌ పోషించిన ఓ పోలీస్‌ రోల్‌ను తరువాత తెలుగులో ఇద్దరు హీరోలు చేశారు. అందులో ఒక సినిమా బ్లాక్‌ బస్టర్ హిట్ కాగా, మరో సినిమా దారుణమైన డిజాస్టర్ అయ్యింది.

 

IHG
అమితాబ్‌ బచ్చన్‌కు మెగాస్టార్‌ ఇమేజ్‌ రావటం వెనుక కీలకమైన సినిమా జంజీర్‌. బిగ్‌ బీ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌ అయ్యింది. 1973లో రిలీజ్‌ అయిన ఈ సినిమాలో అమితాబ్‌, జయా బాధురి, ప్రాణ్‌, ఓం ప్రకాష్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాలీవుడ్‌ సినిమా ఫేజ్‌నే మార్చేసింది. అప్పటి వరకు రొమాంటిక్‌ సినిమాలు మాత్రమే వస్తున్న బాలీవుడ్‌ను జంజీర్‌ యాక్షన్‌ సినిమావైపు మళ్లించింది.

 

IHG
ఇదే సినిమాను 1974లో నిప్పులాంటి మనిషి పేరుతో రీమేక్‌  చేశాడు ఎన్టీఆర్‌. ఎస్‌డీ లాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించగా లత, సత్యనారాయణలు ఇతర కీలక పాత్రల్లో నటించారు.  ఎన్టీఆర్ సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్ కావటమే కాదు. తరువాత అమితాబ్‌ చేసిన చాలా సినిమాలను ఎన్టీఆర్ రీమేక్‌ చేసేందుకు ప్రేరణ ఇచ్చింది.

 

IHG's a stupid rumour: Ramcharan - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BOLLYWOOD' target='_blank' title='bollywood-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bollywood</a> ...
అయితే ఇదే సినిమాను 2013లో తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రీమేక్‌ చేశాడు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్. హిందీతో జంజీర్ పేరుతోనే రీమేక్‌ చేయగా, తెలుగులో తుఫాన్‌ పేరుతో రిలీజ్ చేశాడు. అపూర్వ లఖియా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా ప్రియాంక చోప్రా నటించింది. తన వంతుగా చరణ్ మంచి పర్ఫామెన్సే ఇచ్చినా ఈ సినిమా రెండు భాషల్లోనూ డిజాస్టర్‌ అయ్యింది. దీంతో చరణ్ బాలీవుడ్‌ ఆశల మీద నీళ్లు చల్లినట్టైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: