పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటి కొమరం పులి. ఈ సినిమాలో రిజల్ట్‌తో పాటు సినిమాలో పవన్ లుక్, క్యారెక్టర్, డైలాగ్స్ ఇలా అన్ని అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశపరిచాయి. సినిమా చూసిన ఆడియన్స్ అసలు పవన్ ఈ కథను ఏం చూసి ఒప్పుకున్నాడా..? అన్న ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్.
ఇక సినిమా విషయానికి వస్తే.. పవన్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఖుషీ సినిమా డైరెక్ట్ చేసిన ఎస్ జే సూర్య, తన స్టైల్‌కు భిన్నంగా చేసిన సినిమా కొమరం పులి. ఈ సినిమాతో పవన్‌ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించాలనుకున్న దర్శకుడు బొక్క బొర్లా పడ్డాడు. పవన్ ను రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా అగ్రెసివ్ టోన్‌లో చూపించి నిరాశపరిచాడు. ఈ సినిమాలో పవన్ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌ను అలరించకపోగా చికాకు తెప్పించాయి.
సింగనమల రమేష్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నిఖిషా పటేల్ నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ మెయిన్ విలన్‌గా నటించాడు. సినిమా మేకింగ్ విషయంలోనే కాదు, క్యారెక్టర్ డిజైనింగ్‌లోనూ దారుణంగా ఫెయిల్ అయ్యాడు దర్శకుడు. అప్పటి వరకు లాంగ్ హెయిర్‌తో కనిపించిన పవన్‌ను షార్ట్ హెయిర్‌తో పోలీస్ కటింగ్ చేయించి చూపించాడు.
విలన్ లుక్ కూడా ఆసక్తికరంగా లేకపోవటం యాక్షన్ ఎపిసోడ్స్ మరీ నమ్మశక్యంగా లేకపోవటం ఇలా ప్రతీ విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు దర్శకుడు ఎస్జే సూర్య. దీంతో పవన్ అభిమానులకు ఈ సినిమా ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది.