జులై 30, 2004 వ సంవత్సరంలో విడుదలైన ఘర్షణ సినిమాలో వెంకటేష్, ఆసిన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో, యానా గుప్తా, అమిత, చందన, రాజేష్, సలీం, బాలాజీ, రవి వంశీ ప్రధాన పాత్రలో నటించారు. డిసిపి రామచంద్ర పాత్రలో నటించిన వెంకటేష్ మొట్టమొదటిగా చాలా దృఢంగా తయారయ్యి అసలు సిసలైన పోలీసు ఆఫీసర్ గా కనిపించాడు. 


డిసిపి రామచంద్ర కి న్యాయవ్యవస్థపై అస్సలు నమ్మకం ఉండదు. అందుకే నేరాలు-ఘోరాలు చేసేవారిని తుపాకీతో కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేస్తుంటాడు. ఒరిస్సాకు చెందిన అతిపెద్ద కిరాతకమైన రౌడీ దాస్ ని కూడా రామచంద్ర ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. అయితే తమ్ముడైన పాండా రామచంద్ర అబ్బాయి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే స్కూల్ టీచర్ మాయ(ఆసిన్) రామచంద్ర కి తారసపడుతుంది. మొదటి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు రామచంద్ర. ఇది తెలుసుకున్న పాండా మాయని కిడ్నాప్ చేస్తాడు.

 

దీంతో రామచంద్ర మాయ ని వెతుక్కుంటూ వారి చెర నుంచి ఆమెను బయటకు తీసుకొస్తాడు. చివరికి మంచి చెడు పై గెలిచిందని ఈ సినిమాలో చూపించబడుతుంది. ఈ చిత్రానికి స్టోరీ స్క్రీన్ ప్లే లను గౌతమ్ అందించాడు. తానే దర్శకత్వం కూడా వహించాడు. ఘర్షణ చిత్రంలో వెంకటేష్ ని సరి కొత్తగా చూపించిన గౌతమ్ కి ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు హ్యారీస్ జయరాజ్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ని సమకూర్చి ఈ యాక్షన్ పోలీస్ డ్రామా కి ప్రాణం పోసాడు.

 

ఇందులోని అన్ని పాటలు చాలా బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా చెలియా చెలియా అనే పాట అప్పట్లో సంచలనం సృష్టించిందంటే అతిశయోక్తి కాదు. కథానాయకుడు పాత్రలో నటించిన ఆసిన్ కూడా తన అందచందాలతో అభినయంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఏది ఏమైనా తెలుగు పరిశ్రమలో ఘర్షణ మూవీ పోలీస్ స్టోరీతో తెరకెక్కిన అన్ని సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: