తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. దాదాపుగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సీనియర్ హీరోలు అందరూ తమ కెరీర్లో ఎన్నో సార్లు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో  పోలీస్ పాత్రలో నటించి ఆ పాత్రను పండిస్తూ ఉంటారు, కొన్ని కొన్ని సార్లు హీరోలు పోలీస్ పాత్రలో పవర్ ఫుల్  హీరోయిజం చూపించి రౌడీల ఆగడాలను అరికడుతూ  ఉంటే మరికొన్ని సార్లు పోలీస్ పాత్రలో సరికొత్త కామెడీని పండిస్తూ ఉంటారు హీరోలు, 

 


 అయితే ఇప్పటివరకు చాలా మంది హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి పవర్ ఫుల్ యాక్షన్ తో ఆకట్టుకుంటే... టాలీవుడ్ స్టార్ హీరో అయినా అక్కినేని నాగార్జున మాత్రం... ఆవిడ మా ఆవిడే అనే సినిమాలో పోలీస్ పాత్రలో నటించి సరికొత్త కామెడీ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. టబు నాగార్జున హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో.. ఇద్దరూ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉంటారు. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి  చివరికి పెళ్లి చేసుకుంటారు. అంతేకాదు నాగార్జున టబు  కూడా ఇద్దరూ మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లుగా ఉంటారు. 

 


 ఇక ఆ తర్వాత ఒక సమయంలో నాగార్జున భార్య చనిపోవడంతో కుటుంబసభ్యులు బలవంతంగా నాగార్జునకు వేరే పెళ్లి చేస్తారు. దీంతో అప్పటి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత మొదటి భార్య కూడా తిరిగి వస్తుంది. దీంతో ఇద్దరు భార్యల మధ్య నాగార్జున నలిగిపోతూ ఉంటాడు. ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతున్న నాగార్జున చేసే కామెడీ నిజంగానే ప్రేక్షకులను అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమా టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా కూడా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: