వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గత కొంత కాలంగా ప్రముఖుల జీవిత చరిత్రలను తెరకెక్కించి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపారు. గత ఏడాది అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రాన్ని తెరకెక్కించి అనేకమైన వివాదాల్లో చిక్కుకున్నాడు. కేఎ పాల్ వంటి వారిని కూడా ఈ సినిమాలో వదల్లేదు రాంగోపాల్ వర్మ. లాక్‌డౌన్‌ సమయంలోనే రెండు బూతు చిత్రాలను చిత్రీకరించి డిజిటల్ గా విడుదల చేసి కోట్ల రూపాయల లాభాలను సంపాదించి వావ్ అనిపించాడు. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత మారుతీ రావు, ప్రణయ్ అమృతల నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఒక సినిమా చేయబోతున్నానని తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియపరిచాడు రామ్ గోపాల్ వర్మ.


తదనంతరం బ్రేకింగ్ న్యూస్ అంటూ తన తదుపరి చిత్రమైన 'పవర్ స్టార్' ఆర్జీవి వరల్డ్ థియేటర్ లో విడుదలవనున్నదని... పవర్ స్టార్, మెగా స్టార్ నాగబాబు, రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు 8 ఎనిమిది గేదెలు ఇందులో నటించబోతున్నారని ప్రకటించాడు. ఆ తర్వాత మరొక ట్వీట్ చేసి పవర్ స్టార్ సినిమాలో కథానాయకుడు ఇతడే అంటూ అచ్చం పవన్ కళ్యాణ్ లాగానే కనిపించే డూప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి సంబంధించిన ఒక టిక్ టాక్ వీడియో అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో అతడు అత్తారింటికి దారేది లో పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్ ని ధరించి కనిపించాడు. 


ఈ వీడియో... డూప్ ఆర్టిస్ట్ తన ఆఫీస్ కి వచ్చినప్పుడు చిత్రీకరించబడింది అని కూడా తెలిపాడు. యాదృచ్చికంగా ఇతను వేరే వారిలాగా కనిపిస్తే అది ఖచ్చితంగా యాదృచ్ఛికమే. ఉద్దేశపూర్వకంగా సినిమా తెరకెక్కించడంలేదని కేవలం ఇది అనాలోచితమంటూ పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ ప్రస్తావించకుండానే నెట్టింట పెద్ద సంచలనమే సృష్టించాడు. అయితే ఈ సినిమా గురించి ఎటువంటి సమాచారం ఆర్జీవి వెల్లడించలేదు కానీ విశ్వసనీయ వర్గాల నుండి ఈ సినిమా కథ గురించి కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 


పవర్ స్టార్ అనేది రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న పవన్ కళ్యాణ్ బయోపిక్ అని.. ఈ సినిమా చిత్రీకరణను త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో ఎక్కువగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి చూపించబడుతుందట. పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో ఎలా ఉండేవాడు, వైవాహిక జీవితం ఎలా కొనసాగింది? మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందన్న అంశాలు కూడా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో తాను తీస్తున్న బయోపిక్ లలో చాలా మందిని వెటకారం గా చూపించిన ఆర్జీవి పవన్ ని కూడా వెటకారంగా చూపించబోతున్నాడని... మళ్ళీ వివాదాలకు దారి తీయబోతున్నాడని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: