తెలుగు సినిమాల్లో హరోలతో సమానమైన స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. ఇందుకు ఆమె ఎంచుకున్న పాత్రలే కారణం. నెంబర్ వన్ హీరోయిన్ గా విజయశాంతి డ్యాన్సులు మాత్రమే దు.. ఫైట్స్ చేసే డాషింగ్ లేడీ కూడా ఉందని నిరూపించిన సినిమాలెన్నో ఉన్నాయి. ఆమె కెరీర్లో అటువంటి ఆణిముత్యం ‘కర్తవ్యం’. ఈ సినిమాలో ఆమె నటన, ఆహార్యం అద్భుతం. ఆమె కోసమే ఈ కథ రాశారా.. ఈ కథ కోసమే విజయశాంతి సినిమాల్లోకి వచ్చారా అనేంత పేరు తీసుకొచ్చింది విజయశాంతికి. ఈ సినిమా విడుదలై నేటికి 30ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

మోహనగాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1990 జూన్ 29న విడుదలైంది. విజయశాంతితో లేడీ ఓరియంటెడ్ సినిమా తీయాలన్న దర్శకుడి ఆలోచనకు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన కథను సిద్ధం చేశారు. అప్పటికే దేశంలో మోగిపోయిన తొలి మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీని ఆదర్శంగా తీసుకుని ఈ కథ రచన చేశారు. సమాజంలోని అరాచక శక్తులపై తెగబడే పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయశాంతి అద్భుతంగా నటించారు. విజయశాంతి రోరింగ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలైట్. వైజయంతీ ఐపీఎస్ పాత్రలో విజయశాంతి నటించింది అనేకంటే జీవించింది అని చెప్పాలి.

IHG

 

విడుదలైన ప్రతిచోటా సూపర్ హిట్ అయింది. ఈ సినిమ ప్రారంభోత్సవం, శతదినోత్సవ కార్యక్రమాలకు కిరణ్ బేడీ హాజరవడం విశేషం. లేడీ ఓరియంటెడ్ సినిమాల అర్ధం మార్చేసి ‘కర్తవ్యం’ ఓ దిక్సూచీగా నిలిచిపోయింది. సినిమాలో ఆమె నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కింది. విజయశాంతికి పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన ఏఎం రత్నం ఈ సినిమాను శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాతో విజయశాంతికి ‘లేడీ అమితాబ్’ అనే పేరు స్థిరపడిపోయింది. త‌మిళంలో ‘వైజ‌యంతి ఐపీయ‌స్’, హిందీలో ‘తేజ‌స్విని’ పేరుతో రీమేకై హిట్టయింది.  

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: