ఇప్పుడంటే రామ్ గోపాల్ వర్మ ఇలా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు తానో సెన్సేషన్. పక్కాగా చెప్పాలంటే ఇండియన్ సినిమా గేమ్ చేంజర్. తెలుగు సినిమా వర్మ రాకముందు.. వర్మ వచ్చిన తర్వాత. ఇంతట ఘన చరిత్ర రామ్ గోపాల్ వర్మ. సినిమా టెక్నిక్ నే మార్చేసిన వర్మ ఎన్నో సంచలన సినిమాలు తీశాడు. చిన్న పాయింట్ తో రెండున్నర గంటల సినిమాను ఎలా రక్తికట్టించాలో వర్మ చేసి చూపించాడు. వర్మ తీసిన ఆ సినిమాల లిస్టులో ‘అనగనగా ఒకరోజు’ ఒకటి. మామూలు లవ్ స్టోరీకి క్రైమ్ యాడ్ చేసి కామెడీ నింపేసి సూపర్ హిట్ కొట్టాడు.

IHG

 

25ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా జ్ఞాపకాలను రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పంచుకుంటున్నాడు. తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో ఆ సినిమా తాలూకూ ఓ ఫోటోను పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలో జేడీ-ఊర్మిళతో పాటు సినిమా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఉన్నారు. ‘అనగనగా ఒకరోజు సినిమా షూటింగ్ పూర్తయిన ఆఖరు రోజున టీమ్ మొత్తం కలిసి దిగిన గ్రూప్ ఫొటో’ అంటూ ఆ ఫొటోకు ఏమాత్రం జీవం లేని కొటేషన్ ఇచ్చాడు. ఇది కూడా వర్మ స్టైలే.

IHG

 

ఇక సినిమాకు హీరో అంటే ఖచ్చితంగా బ్రహ్మానందమే. ‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..’ అంటూ బ్రహ్మీ చేసిన కామెడీ ఇప్పటికీ హైలైట్. నిజానికి ఈ సినిమాను మొదట కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రారంభించాడు వర్మ. అయితే.. కొన్ని కారణాల వల్ల తానే తెరకెక్కించాడు. వర్మ పోస్ట్ చేసిన పిక్ లో కోట శ్రీనివాసరావు, రఘువరన్, రామిరెడ్డి.. యూనిట్ అంతా ఉన్నారు. నిజంగానే ఇదొక 25ఏళ్ల మంచి జ్ఞాపకం. వర్మ పోస్ట్ చేయడంతో ఇది ఆ టీమ్ అందరికీ ‘మధు జ్ఞాపకం’ అనే చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: