మెగా పవర్ స్టార్ రాంచరణ్ రంగస్థలం సినిమా తర్వాత వినయ విధేయ రామ చిత్రంలో నటించాడు కానీ అది డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో తాను తీవ్ర నిరాశ చెందాడని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈసారి అతడు స్క్రిప్ట్ ఎంపిక చేసుకోవడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్నాడని తెలుస్తుంది. నిజం చెప్పాలంటే రామ్ చరణ్ మంచి నటుడు. కథాబలం ఉన్న సినిమాలో తాను నటిస్తే అది భారీ హిట్ అవ్వడం ఖాయం. నటించడం వచ్చు కదా అని ఏదో ఒక స్క్రిప్ట్ కి ఓకే చెప్పేసి సినిమా తెరకెక్కించి మమ అనిపించుకోవడానికి చెర్రీ ఏమాత్రం సిద్ధంగా లేడు.


బాలీవుడ్ పరిశ్రమలో అమీర్ ఖాన్ ఎలాగైతే మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటిస్తున్నాడో అదేవిధంగా రామ్ చరణ్ కూడా మంచి కథాబలం ఉన్న సినిమాల్లో నటించి తన పాపులారిటీని నలుదిశలా వ్యాప్తి చేయాలని భావిస్తున్నాడు. కానీ ఎన్ని సినిమా స్క్రిప్టును విన్నా తనకు మాత్రం ఏవీ కూడా మంచిగా అనిపించడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో చెర్రీ ద్వితీయ హీరోగా నటిస్తున్నాడు కాబట్టి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన తనకు గుర్తింపు అంతగా లభించదు. అందుకే సోలో గా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవాలని చెర్రీ శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. ఐతే ఈ స్క్రిప్ట్ తనకే సెట్ అవుతుంది ఈ స్క్రిప్ట్ తనకి అసలు సూట్ అవ్వదు అని రాంచరణ్ ఒక నిర్ణయానికి రాలేక పోతున్నాడు. దీంతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సంప్రదించిన చెర్రీ తన కోసం ఒక మంచి స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేయవలసిందిగా కోరాడట.


తెలివైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెర్రీ కి సహాయం చేసేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. చెర్రీ స్క్రిప్టు ఎంపికలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతవరకు నిమగ్నమయ్యి అతనికి హిట్ దక్కలేగా చేస్తాడో చూడాలిక. మెగా ఫ్యామిలీ లో ఒకరైనా పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ బాగా దగ్గర వాడే కాబట్టి చెర్రీ కి సాధ్యమైనంత సహాయం చేస్తాడని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: