సినిమా అంటే వ్యాపారం. వినోదం అన్నది ఎంత ఉన్నా ప్రధానంగా తీసేది కాసుల కోసమే. కళను జోడించినా కూడా ఎవరైనా  నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని అనుకుంటారు. అందులో తప్పు లేదు కూడా. నిజానికి సినిమా ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి కోట్లాడి మంది దేశవ్యాప్తంగా  బతుకున్నారు. ఇక సినిమాల వల్ల పన్నులు రూపంలో ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయలు వెళ్తుంది.

IHG

ఇవన్నీ పక్కన పెడితే సినిమాలు ఆడడానికి ఇపుడు థియేటర్లు లేవు. గత మూడు నెలలుగా థియేటర్లు మూసేశారు. దాంతో సినిమా బొమ్మ ఎక్కడా పడడంలేదు. ఈ పరిణామంతో అటు నిర్మాతలు, ఇటు ధియేటర్ల యజమానులు కూడా భారీ నష్టం చూస్తున్నారు. 

IHG

ఇప్పటికి అంటే గడచిన మూడు నెలలుగా సినిమాలు ఆడకపోవడం వల్ల ఆరు వేల కోట్ల రూపాయలు భారతీయ సినిమా పరిశ్రమ నష్టపోయిందని అంటున్నారు. ఇందులో నిర్మాతల నుంచి, థియేటర్ల ఓనర్ల వరకూ అందరి వాటా కూడా ఉంది. 

IHG

సినిమాలు అప్పూ సొప్పూ చేసి రీళ్ళుగా మార్చి అవి సినిమా హాళ్ళ వరకూ నడవకుండా తన వద్దే పోగేసుకోవడం వల్లన కూడా నిర్మాతలు భారీగా నష్టాలు చవిచూస్తున్నారని అంటున్నారు. వడ్డీలకు పెట్టుబడులు తెచ్చి పెట్టి సినిమా తీసిన వారంతా ఇపుడు కళ్ళ వెంట రక్తాలు కారుస్తున్నారుట. మరి లాక్ డౌన్ ఎపుడు పూర్తి అవుతుంది. కరోనా మహమ్మారి ఎపుడు పోతుంది. సినిమా బొమ్మ ఎపుడు పడుతుంది అని సినీ పరిశ్రమ యావత్తు ఎదురుచూస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: