శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అందుకు కారణం బాలీవుడ్, కోలీవుడ్ లలో 100 కోట్ల కి పైగా వసూళ్ళు సాధించి సంచలన విజయం అందుకోవడమే. పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కుతుండగా... అమితాబ్ బచ్చన్ .. అజిత్.. పోషించిన పాత్రల కంటే ఇంకా పవర్ ఫుల్ లాయర్ గా వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ ని చూపించబోతున్నాడు దర్శకుడు వేణు శ్రీరాం. 

 

IHG

శృతిహాసన్ గెస్ట్ రోల్ లో కనించబోతుండగా నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సీనియర్ నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తర్వాత నివేదా థామస్ పోషించే పాత్ర బాగా పాపులర్ అవుతుందని ఇప్పటికే టాక్ మొదలైంది. ఇక ఈ సినిమాకి దాదాపు టాకీ పార్ట్ మొత్తం కంప్లీటవగా కేవలం పవన్ కళ్యాణ్ మీద తీయాల్సిన కోర్ట్ సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండగా త్వరలో ఆ సీన్స్ ని పూర్తి చేస్తారని సమాచారం. 

 

IHG's Vakeel Saab To Join <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=FESTIVAL' target='_blank' title='festival-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>festival</a> Race

అయితే తాజాగా వకీల్ సాబ్ నుండి పవన్ కళ్యాణ్ లుక్ లీకయింది. ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ లుక్ ఎలా బయటకు వచ్చిందని చిత్ర యూనిట్ షాకయ్యారంటు ఆ తర్వాత వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమంది మాత్రం వకీల్ సాబ్ ఎప్పుడు రిలీజవుతుందో యూనిట్ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దాంతో సినిమా మీద ఎక్కడ క్రేజ్ తగ్గిపోతుందో అన్న ఉద్దేశ్యంతో ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను కొన్నాళ్ళు ఆకట్టుకునేందుకే ఇలా లుక్ లీక్ చేసి 'అందాక ఇంద దీంతో సరిపెట్టుకోండంటూ' లీకులిచ్చారని మాట్లాడుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని చాలామంది ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: