బాలయ్య సినిమా అంటేనే నందమూరి ఫ్యాన్స్ కి పిచ్చి. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా చూస్తారు. అయితే బాలయ్య అప్ టు డేట్ గా ఉండాలని ఈ మధ్య ఫ్యాన్స్ నుంచి కూడా ఒక సూచన వస్తోంది. అయితే బాలయ్య మాత్రం ఇంకా తన ఓల్డ్ ట్రెడిషన్నే ఫాలో అవుతున్నారు. తన సినిమాల్లో యాక్షన్, రొడ్డ కొట్టుడు భారీ డైలాగులు, పిచ్చ కొట్టుడు ఫైట్లు ఇలా బాలయ్య ఏ మాత్రం మారలేదని ఆయన సినిమాలకు పెట్టే భారీ టైటిల్స్, సినిమాలో లాజిక్ ఏ మాత్రం లేకుండా తీసే సీన్స్ అన్నీ కూడా బాక్సులను వెనక్కి తిప్పిపంపిస్తున్నాయి.

IHG's Birthday <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GIFT' target='_blank' title='gift-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>gift</a> To Fans ...

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య కొన్ని కాంబోలకు బాగా సెట్ అవుతాడు. అప్పట్లో బాలయ్య కోదండరామిరెడ్డి సినిమాలకు యమ క్రేజ్ ఉండేది. అలాగే బాలయ్య బీ గోపాల్ అంటే మాస్ మసాలా మూవీయే. బాక్సాఫీస్ బద్దలయ్యేదే. అంతకు ముందు  వరకూ వెళ్తే కోడి రామక్రిష్ణ కూడా బాలయ్యకు ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు. ఇపుడు బాలయ్యకు అలా వరస హిట్లు ఇస్తున్న డైరెక్టర్ గా బోయపాటి శ్రీను ని చెప్పుకోవాలి. పదేళ్ళ క్రితమే బాలయ్య కెరీర్ ఇబ్బందులో పడినపుడు సింహా మూవీతో మళ్ళీ ఫాంలోకి తెచ్చాడు. ఆ తరువాత లెజెండ్ తో సూపర్ దూపర్ హిట్ ఇచ్చాడు.

IHG

ఇపుడు ఈ ఇద్దరి కాంబోలో ముచ్చటగా మూడవ సినిమా వస్తోంది. దాని టైటిల్ విషయంలో ఎన్నో పేర్లు వస్తున్నాయి. నిన్నటిదాకా మోనార్క్ అనుకున్నారు. అయితే ఇపుడు కధకు సరిపోయే మంచి టైటిల్ దొరికిందిట. అదే సూపర్ మాన్. ఈ టైటిల్ అయితే కధకు ఫుల్ యాప్ట్ అంటున్నారు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ అంటున్నారు. రెండవ రోల్ సూపర్ పవర్ కలిగి ఉంటుందట.

IHG

అందుక సూపర్ మాన్ అని టైటిల్ అనుకుంటున్నారుట. మరీ ముఖ్యంగా  బోయపాటి ఈ టైటిల్ మీద బాగా ఇష్టపడుతున్నాడుట. ఇక బాలయ్య సంగతి చెప్పేదేముంది. తండ్రి ఎన్టీయార్ నటించిన సూపర్ మాన్ సినిమా టైటిల్ అది. దాంతో బాలయ్య కూడా ఒకే అంటున్నారుట. టోటల్ గా ఈ మూవీకి ఆ టైటిల్ పెడతారని అంటున్నారు. ఇక ఎన్టీయార్ సూపర్ మాన్ మూవీ 1980 జూలై 10న  రిలీజ్ అయింది. వి మధుసూదనరావు డైరెక్టర్. జయప్రద హీరోయిన్. అయితే ఈ మూవీ ఏవరేజ్ గా నిలిచింది. మరి తండ్రి టైటిల్ తో సినిమా చేసే బాలయ్య ఈసారి సూపర్ డూపర్ హిట్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: